అన్వేషించండి

యశ్​కి 'కేజీఎఫ్' లాంటి సినిమా పడటం అదృష్టమన్న రవితేజ - ఫైర్ అవుతున్న కన్నడ స్టార్ ఫ్యాన్స్!

మాస్ మహారాజ రవితేజ ఓ బాలీవుడ్ మీడియాలో కేజిఎఫ్ హీరో యశ్​పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్​తో హర్ట్ అయిన యశ్ ఫ్యాన్స్ రవితేజపై ఫైర్ అవుతున్నారు.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో 'కేజిఎఫ్' హీరో యశ్​పై చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా ఆ కామెంట్స్ విని యశ్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. దాంతో రవితేజపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా రవితేజ యశ్ గురించి ఏమన్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే.. రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. సౌత్​ కంటే నార్త్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఎందుకంటే 'టైగర్ నాగేశ్వరరావు' రవితేజ కెరీర్​లోనే మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఎలాగో సౌత్​లో రవితేజకి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ముందు నార్త్ నుంచి ప్రమోషన్స్​ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్​లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీ అయిపోతున్నాడు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజను కొంతమంది సౌత్ సూపర్ స్టార్స్ పేరు చెప్పి వాళ్లలో నచ్చిన క్వాలిటీస్ గురించి అడగగా అందుకు రవితేజ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, అతను చాలా మంచి డాన్సర్ అని.. ప్రభాస్​ని డార్లింగ్ అని, రాజమౌళిలో ఆయన విజన్ అంటే ఇష్టమని చెప్పగా.. కన్నడ హీరో యశ్ గురించి అడిగితే, యశ్ గురించి చెప్పాలంటే 'అతని 'కేజిఎఫ్' మూవీ మాత్రమే నేను చూశాను. అతను చాలా లక్కీ, కేజీఎఫ్ లాంటి సినిమా అతనికి పడింది' అని అన్నాడు.

ఇది కాస్త యశ్ ఫ్యాన్స్​కి నచ్చలేదు. దాంతో నెట్టింట రవితేజపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సోషల్ మీడియాలో.. "కేజిఎఫ్ సినిమా కోసం ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడని, ఆ ఎనిమిది సంవత్సరాలు మరే సినిమా చేయకుండా తన ఫుల్ డెడికేషన్ మొత్తం కేజీఎఫ్​ పైన పెట్టాడని, పూర్తి అంకితభావంతో సినిమా కోసం పని చేశాడని, అలాంటిది యశ్​కి 'కేజీఎఫ్' సినిమా పడడం అదృష్టమని ఎలా చెప్తారు?" అంటూ రవితేజపై ఫైర్ అయ్యాడు. మరో అభిమాని, "మీ కామెంట్స్​తో మీరే గౌరవాన్ని పోగొట్టుకున్నారు. ఏ విధంగా చూసినా నీకంటే యష్ చాలా బెటర్",  "కొంతమంది చిన్న హీరోలకి యశ్ పట్ల అసూయ ఉంది. బస్ డ్రైవర్ కొడుకు ఇలా పాన్ ఇండియా స్టార్ అవ్వడాన్ని వాళ్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు" అంటూ మరో అభిమాని రాస్కొచ్చాడు.

అలా సోషల్ మీడియాలో ప్రస్తుతం యశ్ ఫాన్స్ రవితేజపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 'టైగర్ నాగేశ్వరరావు' విషయానికి వస్తే.. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్ హీరోయిన్ నుపూర్ సనన్ ఈ చిత్రంతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్​పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్​లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.

Also Read : రణ్​బీర్, రష్మికల రొమాన్స్ నెక్స్ట్ లెవెల్.. అర్జున్ రెడ్డిని మరపించేలా 'యానిమల్' ఫస్ట్ సాంగ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget