అన్వేషించండి

Animal First Song : రణ్​బీర్, రష్మికల రొమాన్స్ నెక్స్ట్ లెవెల్.. అర్జున్ రెడ్డిని మరపించేలా 'యానిమల్' ఫస్ట్ సాంగ్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన నటిస్తున్న 'యానిమల్' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది 'అమ్మాయి' అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

Animal First Song : బాలీవుడ్​లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న 'యానిమల్'(Animal) నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'అమ్మాయి' అంటూ సాగే ఈ పాట ఫుల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ సినీ లవర్స్​కి బిగ్ సర్​ప్రైజ్ ఇచ్చారు. సహజంగా కొత్త సినిమాల నుంచి మేకర్స్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు. కానీ 'యానిమల్' మేకర్స్ మాత్రం కాస్త డిఫరెంట్​గా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసేశారు. 'అర్జున్ రెడ్డి' మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'యానిమల్' మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్నారు.

ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' సినిమాని బాలీవుడ్​లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు 'యానిమల్'తో స్ట్రైట్ బాలీవుడ్ మూవీని రూపొందిస్తుండడంతో ఈ మూవీపై నార్త్​తో పాటు సౌత్​లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్​గా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలని తారస్థాయికి తీసుకెళ్లింది. టీజర్​లో రణబీర్​ని ఊర మాస్ అవతార్​లో చూపించారు సందీప్ రెడ్డి వంగ. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మేకర్స్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ సాంగ్​కి సంబంధించి రణబీర్, రష్మిక లిప్ లాక్ పోస్టర్ నెట్టింట హాట్ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా 'యానిమల్' నుంచి ఫస్ట్ సాంగ్​ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్​లో రణబీర్, రష్మికల మధ్య ఘాటు లిప్ లాక్ సీన్స్ ఓ రేంజ్​లో ఉన్నాయి. మ్యూజిక్, లిరిక్స్, విజువల్స్ అన్ని టాప్ క్లాస్ అని చెప్పొచ్చు.' నింగి నేల నీలా నాలా' అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. దాదాపు 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట ఫుల్ వీడియోని రిలీజ్ చేయడం నిజంగా సర్​ప్రైజ్​ అనే చెప్పాలి. రణ్​బీర్​ను తీసుకొచ్చి రష్మిక తను లవ్ మ్యాటర్​ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే.. వాళ్లు ఒప్పుకోకపోవడంతో వాళ్ల ముందే ఇద్దరూ లిప్ కిస్ చేసుకుంటారు. అక్కడి నుంచి ఈ సాంగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లైట్ లో ఓ రేంజ్​లో రొమాన్స్ చేసుకుంటారు. ఆపై మంచుకొండపై ఉన్న ఓ చిన్న గుడిలో సింపుల్​గా మ్యారేజ్ చేసుకోవడం.. ఇలాంటి సీన్స్​ని ఈ వీడియో సాంగ్​లో చూపించారు.

ఈ పాట వీడియో చూస్తున్నప్పుడు అర్జున్ రెడ్డి మూవీ గుర్తుకు రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమాలో మాదిరిగానే ఈ పాటలోనూ లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రాఘవ్ చైతన్య, ప్రీతమ్ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.. రణబీర్ తండ్రి పాత్రలో కనిపించనుండగా.. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. భద్రకాళి ఫిలిమ్స్, టి సిరీస్ సంస్థలపై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న హిందీ, తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్​గా విడుదల కానుంది.

Also Read : బాలీవుడ్​లో మరో భారీ ఆఫర్ అందుకున్న నయనతార - ఆ టాప్ డైరెక్టర్ సినిమాలోనే ఛాన్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget