అన్వేషించండి

బాలీవుడ్​లో మరో భారీ ఆఫర్ అందుకున్న నయనతార - ఆ టాప్ డైరెక్టర్ సినిమాలోనే ఛాన్స్!

బాలీవుడ్​లో రీసెంట్​గా జవాన్ మూవీతో సక్సెస్ అందుకున్న నయనతారకి తాజాగా బాలీవుడ్​లో మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

రీసెంట్​గా 'జవాన్'(Jawan) మూవీతో బాలీవుడ్​లో హీరోయిన్​గా అడుగుపెట్టి భారీ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకి తాజాగా బీ టౌన్​లో మరో పెద్ద ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తన సినిమాలో లీడ్ రోల్ కోసం నయనతారని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ బీ టౌన్​లో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే సౌత్​లో లేడీ సూపర్ స్టార్​గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు నార్త్ లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్​గా షారుక్ ఖాన్​కి జోడిగా 'జవాన్'(jawan) సినిమాతో బాలీవుడ్​లోకి అడుగు పెట్టింది.

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నయనతార పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేసింది. దీంతో బాలీవుడ్​లో నయన్​కి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్​లో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన సంజయ్ లీల భన్సాలీ నెక్స్ట్ ప్రాజెక్ట్​లో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్​లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి టాప్ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. ప్రస్తుతం ఆయన 'బైజు బావ్రా'(Baiju Bawra) అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రణవీర్ సింగ్, ఆలియా భట్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సినిమాలో మరో కీలక పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్లుగా సమాచారం. రీసెంట్​గానే కథ విన్న నయనతార కథ బాగా నచ్చిందని అన్నారట. ఈ ఏడాది మార్చిలో ముంబైలోని సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ దగ్గర నయనతార తన భర్త విగ్నేశివన్​తో కలిసి కనిపించింది. అయితే అది 'బైజు బావ్రా' సినిమా కోసమే అని తెలుస్తోంది.

దీంతో సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో నయనతార నటించబోతుందనే వార్త బాలీవుడ్ ఫిలిం సర్కిల్స్​లో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 1952లో విజయ్ భట్ అనే దర్శకుడు 'బైజు బావ్రా' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో భరత్ భూషణ్, మీనా కుమారి ప్రధాన పాత్రలో నటించారు.

బైజు అనే వ్యక్తి ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం మొగల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన తాన్ సేన్​ను ఓ సంగీత పోటీలో ఓడించడాని సవాలు చేసిన బైజు అనే యువ సంగీతకారుడి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అదే చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ రీమేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక 'జవాన్' తో భారీ సక్సెస్ అందుకున్న నయనతార ప్రస్తుతం కోలీవుడ్​లో ప్రముఖ యూట్యూబ్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో 'మన్నన్ గట్టి'(Mannan Gatti) అనే మూవీలో నటిస్తోంది.

Also Read : ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget