Ravi Teja - Mass Jathara Interview: మాస్ కాదు... ఫుల్ ఫన్ ఇంటర్వ్యూస్... రవితేజ ప్రమోషన్స్ షురూ!
Ravi Teja Begins Mass Jathara Promotions: 'మాస్ జాతర' ప్రమోషన్స్ షురూ చేశారు మాస్ మహారాజా రవితేజ. ఐదు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒకదాని తర్వాత మరొక ఇంటర్వ్యూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) అంటే ఎనర్జీ, హుషారు. ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. ఉదయం చిత్రీకరణ ప్రారంభించిన సమయంలో ఎంత ఎనర్జీతో ఉంటారో... సాయంత్రం షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్లే సమయంలో కూడా అంతే ఎనర్జీగా ఉంటారని రవితేజతో పని చేసిన టెక్నీషియన్లు ఆర్టిస్టులు చెబుతారు ఇప్పుడు 'హైపర్' ఆది కూడా ఆ మాటే అన్నారు. ఆయన ఉంటే సరదాగా ఉందని అంటుంటారు. రవితేజ ఇంటర్వ్యూలు కూడా అంతే సరదాగా ఉంటాయని లేటెస్ట్‌గా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.
ఒకటి రెండు కాదు... ఐదు ఇంటర్వ్యూలు!
మాస్ జాతర (Mass Jathara Movie)... రవితేజ కథానాయకుడిగా నటించిన 75వ సినిమా. ఈ నెల అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా రవితేజ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అది కూడా ఒకటే రెండు కాదు... ఏకంగా ఐదు ఇంటర్వ్యూలు చేశారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు సుమ కనకాల. ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్ ఇంటర్వ్యూ అంటే ఆవిడ పేరు తప్పకుండా వినిపిస్తుంది. మాస్ జాతర టీంను ఆవిడ కూడా ఇంటర్వ్యూ చేశారు. సుమతో పాటు మరో యాంకర్ గీతా భగత్ మరొక ఇంటర్వ్యూ చేశారు.
రెగ్యులర్ యాంకర్లతో రెండు ఇంటర్వ్యూలు చేసిన మాస్ జాతర టీం ఆ తరువాత కొత్తగా ప్లాన్ చేసింది. 'లక్కీ భాస్కర్' వంటి సూపర్ హిట్ సినిమా తీయడంతో పాటు ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో సినిమా చేస్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి మరొక ఇంటర్వ్యూ చేశారు. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాల దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరొక ఇంటర్వ్యూ చేశారు.
Also Read: నయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?

సిద్దు జొన్నలగడ్డతో రవితేజ స్పెషల్ చిట్ చాట్!
రవితేజ అంటే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ప్రత్యేకమైన అభిమానం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేశారు. అతిథి పాత్రలో సందడి చేశారు. ఇప్పుడు 'మాస్ జాతర' కోసం రవితేజతో స్పెషల్ చిట్ చాట్ చేశాడు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్న సందర్భంగా వరుస పెట్టి ఈ ఇంటర్వ్యూలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇందులో రవితేజ సరసన శ్రీ లీల నటించారు. గతంలో కొన్ని సినిమాలకు రచయితగా పనిచేసి భాను భోగవరపు 'మాస్ జాతర' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Also Read: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!
View this post on Instagram





















