Ravi Teja Daughter: ఓటీటీలోకి రవితేజ కుమార్తె ఎంట్రీ... హీరోయిన్ కాదండోయ్ - మరి ఏం చేశారో తెలుసా?
Mokshadha Bhupatiraju OTT Debut: మాస్ మహారాజా రవితేజ కుమార్తె ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. తొలి అడుగు ఓటీటీలో వేస్తున్నారు. కథానాయికగా కాదు... నిర్మాణ పరమైన వ్యవహారాలు చూశారు.

ఇండస్ట్రీలోకి వారసులు అడుగు పెట్టడం సహజం. దర్శక నిర్మాతల కుమారులు హీరోలుగా, కుమార్తెలు హీరోయిన్లుగా వచ్చారు. భవిష్యత్తులోనూ వస్తారు. అయితే బట్ ఫర్ ఏ ఛేంజ్... మాస్ మహారాజా రవితేజ కుమార్తె (Ravi Teja Daughter) మోక్షద భూపతిరాజు (Mokshadha Bhupatiraju) కథానాయికగా లేదా నటిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఆ అమ్మాయికి ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే ఇంట్రెస్ట్. నిర్మాణ పరమైన వ్యవహారాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. మొదటి అడుగు ఓటీటీలో వేస్తున్నారు.
ఓటీటీ సినిమా చేసిన మోక్షద భూపతిరాజు!
యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' గుర్తు ఉందా? ఆ చిత్రానికి వినోద్ అనంతోజు దర్శకత్వం వహించారు. ఓటీటీలో ఆ మూవీ మంచి విజయం సాధించింది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కలయికలో రూపొందిన సినిమా 'తక్షకుడు'.
కరోనా కారణంగా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'ని ఓటీటీలో విడుదల చేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. అందువల్ల 'తక్షకుడు' సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారని భావించారంతా! అయితే... ఈ సినిమా సైతం ఓటీటీ విడుదలకు సిద్ధం అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానున్నట్టు తాజాగా వెల్లడించారు. అసలు విషయం ఏమిటంటే... ఈ సినిమాకు రవితేజ కుమార్తె మోక్షద భూపతిరాజు పని చేశారు.
అవును... 'తక్షకుడు' ప్రొడక్షన్ పనులు చూసుకున్నది మోక్షద భూపతిరాజు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే... నిర్మాణ పరమైన వ్యవహారాల్లో అనుభవం కోసం సూర్యదేవర నాగవంశీ దగ్గర మోక్షద భూపతిరాజు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యారు. రవితేజ, నాగవంశీ మధ్య మంచి అనుబంధం ఉంది. అక్టోబర్ 31న విడుదల కానున్న 'మాస్ జాతర' వాళ్లిద్దరి కలయికలో రూపొందింది. ఆ సినిమా జరిగే సమయంలో రవితేజ కుమార్తె సైతం నాగవంశీ నిర్మాణ సంస్థలో పని చేశారు.
Also Read: తొక్కితే పడను... వెంట్రుక తీసి ఇచ్చిన బన్నీ వాసు... పెయిడ్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
View this post on Instagram
కొత్త నిర్మాణ సంస్థ ప్రారభించే ఆలోచనలో...
ఆర్‌టీ టీమ్ వర్క్స్ పేరుతో రవితేజ ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. అయితే ఆ సంస్థలో కాకుండా కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు తీసే ఆలోచనలో మోక్షద భూపతిరాజు ఉన్నారట. అదీ సంగతి! నాగార్జున మేనకోడలు సుప్రియ, అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక - స్వప్న, ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్, సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నాగవంశీ చెల్లెలు హారిక సైతం 'మ్యాడ్' ప్రొడ్యూస్ చేశారు. త్వరలో ఈ జాబితాలో రవితేజ కుమార్తె మోక్షద చేరతారు అన్నమాట.





















