Bunny Vas: తొక్కితే పడను... వెంట్రుక తీసి ఇచ్చిన బన్నీ వాసు... పెయిడ్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Bunny Vas: నేనొక సినిమాను తొక్కితేనే.. పక్క సినిమా ఆడుతుంది, లేదు.. నేను పక్క సినిమాను ట్రోల్ చేస్తేనే సినిమా ఆడుతుంది అనుకుంటే.. అది మీ ఖర్మ. మేమేం చేయలేమని అన్నారు నిర్మాత బన్నీ వాసు.

Bunny Vas Serious Warning To Trollers: ‘పొగడడానికి తక్కువ తీసుకోవచ్చు కానీ, అవతలి వాళ్లని తిట్టడానికి కాస్త ఎక్కువ తీసుకోవాలి. ఎవరైతే మీకు ఈ జాబ్ ఇస్తున్నారో... వాళ్ల దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకోండి’ అని తనపై ట్రోలింగ్ చేయిస్తున్న వారిని ఉద్దేశించి నిర్మాత బన్నీ వాసు బహిరంగ ప్రకటన చేశారు. బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలా బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. సినిమాపై ట్రోల్ చేస్తున్న వారికి బన్నీ వాసు కౌంటర్ ఇచ్చారు. తన సినిమాను తొక్కి ఎదగాలని చూడటం కరెక్ట్ కాదని హిత బోధ చేశారు.
‘‘మిత్రమండలి సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్ 16న అందరూ థియేటర్లకు రండి. నలుగురు హీరోలు చేసే అల్లరి చూసి ఎంజాయ్ చేయండి. దీపావళికి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఎక్కడా ఇబ్బంది పడే సీన్లు ఉండవు. పిల్లలు, పెద్దలతో కలిసి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. దర్శకుడు విజయ్‌ని చూస్తే చాలా జలసీగా ఉంది. అంత మంచి ఫ్రెండ్స్ ఆయనకి ఉన్నారు. ముఖ్యంగా అనుదీప్.. తన సినిమా రిలీజ్ అవుతున్నా.. లాస్ట్ 20 డేస్‌గా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలా విజయ్‌కి తన ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమాకు సపోర్ట్ చేయడం చూసి, ఒకప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఇలా ఉన్నాం కదా.. అనిపించింది. విజయేంద్ర చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇందులో చెకోడి ఛేజ్ అని ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చూసి పొట్టనొప్పి వచ్చేలా నవ్వుకుంటారు. ఇంకా ఈ సినిమాకు పార్ట్ అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.
సినిమా జర్నీలో హేట్, లవ్ అనేవి పార్ట్ ఆఫ్ ది సక్సెస్. భాను నాకు ఈ ట్రైలర్ కింద కామెంట్స్ చూపించాడు. నేనెప్పుడూ కామెంట్స్ చదవను. తను చూపిస్తే చదివాను. అందులో ‘ఎక్కడ నవ్వాలో చెప్పండ్రా’ అని కొందరు కామెంట్స్ చేశారు. అడిగారు కాబట్టి చెబుతున్నా.. థియేటర్లకు రండి, ప్రతి నిమిషం నవ్వుతారు. సినిమా చూసి ప్రతి నిమిషం మీరు నవ్వకపోతే.. అప్పుడు కామెంట్ పెట్టండి. ఫస్ట్ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీరు ఏం చెప్పినా కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఈ అక్టోబర్ 16న 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాలుగు సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. ఫస్ట్ పేస్ బాల్ మాకే తగుతుంది కాబట్టి.. ఎదుర్కొవడానికి, సిక్స్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా తర్వాత వచ్చే వాళ్లు కూడా సిక్స్‌లు కొట్టాలి. ఇండస్ట్రీ బాగుండాలి. అందరూ ఎదగాలి. అందరితో పాటు మనం కూడా ఎదగాలి. ఇది నా యాటిట్యూట్.
అలా కాకుండా.. నేనొక సినిమాను తొక్కితేనే.. పక్క సినిమా ఆడుతుంది, లేదు.. నేను పక్క సినిమాను ట్రోల్ చేస్తేనే సినిమా ఆడుతుంది అనుకుంటే.. అది మీ ఖర్మ. మేమేం చేయలేం. ఎందుకంటే, ఇక్కడ సినిమా బాగుంటేనే చూస్తాను. అది నీదైనా, నాదైనా, ఎవరిదైనా సరే.. సినిమా బాగోకపోతే పక్కన పెట్టేస్తారు. ఫైనల్‌గా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ప్రేక్షకుల జడ్జిమెంట్‌కే. మనం ఎవరం.. ఒక సినిమాకు డబ్బులు పెట్టి, ఇంకో సినిమాపై నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్ చేస్తే.. ఆ సినిమా ఏదో తగ్గుతుంది, లేదంటే ఆ సినిమా ఏదో అయిపోతుందని డిసైడ్ చేయడానికి. దానిని చిన్నపిల్లల మనస్థత్వం అంటారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.
బ్రదర్.. మనందరం ఇక్కడుంది ఎదగడానికే. కష్టపడదాం, కష్టపడి కలిసి ఎదుగుదాం. అంతేకానీ, మరో సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసి ఎదుగుదాం అనుకుంటే మాత్రం.. పైన దేవుడు ఉన్నాడు. చూసే ప్రేక్షకులు ఉన్నారు. అంతా వాళ్లే చూసుకుంటారు. కాంపిటేషన్‌లో యుద్ధం చేయడంలో తప్పులేదు. కానీ ఆ యుద్ధానికి ఓ ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు కాంపిటేషన్‌లో ఉన్నా.. నా ఫైట్ ఎప్పుడూ ధర్మంగానే ఉంటుంది. నేను మాత్రం 100 శాతం అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే.. బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను. మనం తీసే ప్రతి సినిమా ఆడాలని కోరుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు. పక్కనున్న సినిమా బాగుండవచ్చు. ఆ రోజు ఆ సినిమా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగున్న రోజు, అది ఆడాలని కోరుకుంటాను. ఇదే నా మైండ్ సెట్. అందుకే నాకు అన్ని సక్సెస్‌లు వస్తున్నాయేమో.
Also Read: సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ వచ్చేసింది - అర్జున్ రెడ్డి, డీజే టిల్లు కలిస్తే ఎలా ఉంటుందో?
ఫైనల్‌గా ఇదేదో చేస్తే.. ఇక్కడేదో తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకుంటున్నారేమో.. నా వెంట్రుక. నేను తల మీద వెంట్రుకనే చూపిస్తున్నా. అది నా సంస్కారం. అంతకు మించి నేను ఎక్కువగా ఆలోచించను. నేను ఎప్పుడూ కూడా పరుగెడతాను, పరుగెడతాను.. పరుగెడుతూనే ఉంటాను. ఎంత మంది ఏం చేసినా కూడా, నేను పరుగెడుతూనే ఉంటాను. ఎందుకంటే, ఆ పరుగెట్టడంలోనే నా విన్ ఉంటుందని నాకు తెలుసు. నేను ఎవరి గురించో ఆలోచిస్తూ కూర్చుంటే, నేను ఇక్కడే ఆగిపోతానని నాకు తెలుసు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసుకుంటారో చేసుకుంది. ఆ ట్రోలింగ్ చేసే వారికి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కాస్త డబ్బులెక్కువ తీసుకోండి. ఎందుకంటే, మీ పాజిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకొచ్చి నెగిటివ్‌గా పెట్టి, ఒకరిని తిట్టడానికి మీరు చీప్‌గా ఉండొద్దు. అది చాలా ఖరీదైనది. పొగడడానికి తక్కువ తీసుకోవచ్చు కానీ, అవతలి వాళ్లని తిట్టడానికి కాస్త ఎక్కువ తీసుకోవాలి. ఎవరైతే మీకు ఈ జాబ్ ఇస్తున్నారో.. వాళ్ల దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకోండి. అలాగే సినిమా విడుదల తర్వాత కూడా నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలని, నెగిటివ్ ట్రోలింగ్ చేయాలని ప్రీపేరై ఉన్న వాళ్లందరికి కూడా వెల్‌కమ్ చెబుతున్నాను. సినిమా బాగుంటే ఆడుతుంది.. లేదంటే ఒక్కోసారి ఫెయిల్యూర్‌ని ఫేస్ చేయాల్సి వస్తే చేస్తాం. అంతకు మించి ఎక్కువ ఆలోచించే లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. మళ్లీ చెబుతున్నా.. బీ పాజిటివ్. సినిమా బాగుంటే అందరివీ ఆడుతాయి. ఇండస్ట్రీలో అందరం కలిసి ఉండాల్సిన వాళ్లమే, కలిసి జర్నీ చేయాల్సిన వాళ్లమే. అందరం బాగుండాలని కోరుకుందాం. అందరూ హెల్దీగా కాంపిటేట్ అవుదాం..’’ అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.





















