‘దసరా’కు ‘రావణాసుర’ సాయం - రవితేజను కలిసిన నాని, పెద్ద ప్లానే వేసినట్లున్నారుగా!
ఇండస్ట్రీలో సినిమాల్లో నటించే ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి.. ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు మాస్ మహరాజ్ రవితేజ, న్యాచురల్ స్టార్ నాని. మరి వీరిద్దరు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే?
తెలుగు సినిమా రంగంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో స్టార్ నటులుగా ఎదిగిన వారు చాలామందే ఉన్నారు. అలా ఇండస్ట్రీలో సినిమాల్లో నటించే ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు మాస్ మహరాజ్ రవితేజ, న్యాచురల్ స్టార్ నాని. ఈ ఇద్దరు హీరోలకు ఓ ప్రత్యేెకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ స్టైల్ ఉంటుంది. యాక్టింగ్ లో సాలిడ్ ఎనర్జీను చూపిస్తారు. అలా కొద్ది మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. వీరి సినిమా జర్నీలు కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. అందుకే వీరికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అయితే వీరిద్దరూ కలసి ఏ సినిమా చేయలేదు.
నాని నిర్మించిన ‘అ!’ సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ అందించారు. తాజా ఈ ఇద్దరూ కలసి ఉన్న ఓ ఫోటో ఒకటి నాని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. త్వరలో ఓ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు నాని. ఇక నాని ‘సమ్‌థింగ్ ఫన్నీగా చేశాం’ అంటూ పోస్ట్ చేయగా దాని ట్యాగ్ చేస్తూ రవితేజ కూడా ‘ధరణి x రావణాసుర’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రవితేజ, నాని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇటు రవితేజ అటు నాని ఇద్దరు హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా ‘దసరా’ సినిమాలో నటించారు. ఈ సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీను మార్చి 30న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అలాగే మరోవైపు రవితేజ రీసెంట్ గా ‘రావణాసుర’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇద్దరి సినిమాలు కొన్నిరోజుల వ్యవధిలోనే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇద్దరూ కలసి ఏమైనా ప్లాన్ చేశారా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతానికి రవితేజ, నాని సినిమాలు ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఒక హీరో సినిమాకు ఇంకో హీరో ప్రమోషన్స్ ఇవ్వరు. అలాంటి సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అయితే రవితేజ, నాని విషయంలో ఆ ఫార్ములా ఏం ఉండదు. వీరి సినిమాలను అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఇద్దరూ కలసి తమ సినిమాలకు ప్రమోషన్స్ చేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు అభిమానులు. అయితే ఇద్దరూ కలసి ఏదైనా ఇంటర్వ్యూ ప్లాన్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ సర్పైజ్ ఏంటో చూద్దామని అటు రవితేజ, ఇటు నాని మ్యూచువల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే ఆ వీడియోలో రవితేజ, నాని ఎంత సందడి చేశారో చూడాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..
Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు
DHARANI x RAVANA 🤗❤️🔥 https://t.co/IiKt00uR9j
— Ravi Teja (@RaviTeja_offl) March 23, 2023