The Girlfriend: దీక్షిత్ శెట్టికి జంటగా రష్మిక... 'ది గర్ల్ ఫ్రెండ్'లో ఫస్ట్ సాంగ్ 'నదివే' రిలీజ్ ఎప్పుడంటే?
The Girlfriend First Single: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. దీక్షిత్ శెట్టి హీరో. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ 'నదివే...' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో 'ది గర్ల్ ఫ్రెండ్' ఒకటి. ఇందులో టాలెంటెడ్ దీక్షిత్ శెట్టి హీరో. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
జూలై 16న 'నదివే...' సాంగ్ విడుదల!
The Girlfriend First Single Update: 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు కథానాయకుడు - నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'చిలసౌ'లో పాటలు చార్ట్ బస్టర్స్. నాగార్జున 'మన్మథుడు 2'లోనూ పాటలు బావుంటాయి. పైగా, ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీత దర్శకుడు కావడంతో 'ది గర్ల్ ఫ్రెండ్' సాంగ్స్ మీద అంచనాలు పెరిగాయి.
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'నదివే...'ను ఈ నెల 16వ తేదీన (అంటే బుధవారం) విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'నదివే...' పాటను అందమైన మెలోడీగా హేషమ్ అబ్దుల్ వాహాబ్ తీర్చిదిద్దారని చిత్ర బృందం తెలిపింది.
View this post on Instagram
అందమైన ప్రేమ కథతో రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్'ను ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందని, త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్, కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైనర్లు: ఎస్ రామకృష్ణ - మౌనిక నిగోత్రి.





















