Ramayana First Glimpse - 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్: రిలీజ్ డేట్, టైమ్ & ఈవెంట్ ప్లేస్ ఫిక్స్
Ramayana Film Update: రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా... యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'రామాయణ'. త్వరలో సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది.

సీతారాములుగా బాలీవుడ్ కథానాయకుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor), తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్న సినిమా 'రామాయణ' (Ramayana Part 1). ఇందులో రావణుడిగా కన్నడ కథానాయకుడు, 'కేజీఎఫ్' సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యష్ నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
Ramayana First Glimpse Release Date: జూలై 3... ఈ గురువారం 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. బెంగళూరుతో పాటు ఢిల్లీలో స్పెషల్ ఈవెంట్స్ చేసేందుకు ప్లాన్ చేశారు. కర్ణాటకలో యష్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన కోసం బెంగళూరులోని ఫోరం మాల్‌లో ఈవెంట్ చేస్తున్నారు.
సీతారాములు రణబీర్ - సాయి పల్లవితో పాటు రావణుడు యష్ లుక్ కూడా ఫస్ట్ గ్లింప్స్‌లో పరిచయం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 11:30 గంటల తర్వాత ఆ వీడియో విడుదల కానుంది.
Also Read: రామ్ చరణ్ హెల్ప్ చేయలేదు... ఫ్లాప్ తర్వాత ఒక్క ఫోన్ రాలేదు - నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు
#RamayanaTheIntroduction
— Cinema Mania (@ursniresh) July 1, 2025
As per the latest update, the title logo and a short glimpse from the film are set to be unveiled on July 3, 2025.
The launch event will take place at PVR Forum Mall in Bengaluru, starting at 11:30 AM,with the entire team expected to be in attendance. pic.twitter.com/mY5NY2xQyP
ముంబైలో చిత్రీకరణ పూర్తి!
నితీష్ తివారి దర్శకత్వంలో 'రామాయణ' తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ముంబైలో పూర్తి అయ్యింది. చివరి రోజు హీరో రణబీర్ కపూర్ సహా లక్ష్మణుడిగా నటించిన రవి దూబే, యష్ తదితరులు చిత్రీకరణలో పాల్గొన్నారు. షూటింగ్ ఫినిష్ అయ్యాక ముంబై నుంచి యష్ బయలు దేరారు.
Ahead of #RamayanaTheIntroduction First Glimpse Launch, #Yash flying out from Mumbai 🏹#YashBOSS, both the Actor and Producer In #Ramayana, playing Lanka-pati #Ravana character.
— Ashwani kumar (@BorntobeAshwani) July 1, 2025
There is 2 event, simultaneously for #RamayanaMovie, 1st glimpse launch in Bangalore and Delhi.
It… pic.twitter.com/5WwCmPmvqx
సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మండోదరి పాత్రను తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా వచ్చే ఏడాది రామాయణ మొదటి భాగం విడుదల కానుంది రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.





















