అన్వేషించండి

Ramayana Movie: సాయి పల్లవి, రణబీర్‌‌ల ‘రామాయణ్’పై సీరియల్ సీత కామెంట్స్ - ఆ మూవీ ఆపేయాలంటూ వ్యాఖ్యలు

Ramayana Movie Update: ‘రామాయణ’ ఇతిహాసంపై తెరకెక్కిన సినిమాలు, సీరియల్స్ ఒకప్పుడు ప్రేక్షకుల్లో మనసుల్లో నిలిచిపోయేలా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందంటూ నటి దీపికా చిఖ్లియా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Dipika Chikhlia About Ramayana Movie: ఇప్పటివరకు రామాయణం కథ ఆధారంగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ తెరకెక్కాయి. కానీ వాటన్నింటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. అలాంటి వాటిలో రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ సీరియల్ కూడా ఒకటి. అప్పట్లో వారానికి ఒకసారి వచ్చే ఈ సీరియల్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు. ఈ సీరియల్ ద్వారా రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన నటీనటులకు మంచి గుర్తుంపు లభించింది. ఇక ‘రామాయణ్’లో సీత పాత్రలో ఆకట్టుకున్న దీపికా చిఖ్లియా.. నితిష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’పై అనూహ్య కామెంట్స్ చేశారు.

మార్చేస్తున్నారు..

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా చిఖ్లియా.. ఈ ‘రామాయణ్’పై ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ‘‘రామాయణాన్ని పదేపదే తెరకెక్కిస్తున్న మనుషులను చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే వారు అలా చేయకూడదు. అందరూ కలిసి ఈ ఇతిహాసాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నారు. రామాయణాన్ని తెరకెక్కించిన ప్రతీసారి వారు అందులో ఏదో కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కొత్త కథ, కథలో కొత్త కోణం లేదా కొత్త లుక్.. ఇలా’’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు దీపికా.

వారి గురించి చెప్పండి..

తన అభిప్రాయాన్ని చెప్పడం కోసం ‘ఆదిపురుష్’ను ఉదాహరణగా తీసుకున్నారు దీపికా చిఖ్లియా. ‘‘సీతగా నటించిన కృతి సనన్‌కు శాటిన్ చీర కట్టారు. రావణుడిగా కనిపించడం కోసం సైఫ్ అలీ ఖాన్ లుక్కే మార్చేశారు. ఎందుకంటే వారు క్రియేటివ్‌గా కొత్తగా ఏదో చూపించాలని అనుకున్నారు. కానీ దానివల్లే రామాయణం ప్రభావం అనేది పూర్తిగా పోయింది. అందరూ ఈ రామాయణం చుట్టూ తిరగడం ఆపేస్తే బాగుంటుంది. రామాయణం కాకుండా ఇంకా చాలా కథలు ఉన్నాయి. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య యోధుల గురించి మాట్లాడండి. హిస్టరీలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి గురించి చెప్పండి. రామాయణమే ఎందుకు’’ అంటూ ప్రశ్నించారు.

ముందే చెప్పలేం..

అలనాటి ‘రామాయణ్’లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ కూడా రణబీర్ కపూర్ రాముడిగా నటించడంపై స్పందించారు. ‘‘రణబీర్ కపూర్ ఈ పాత్ర చేయగలడా లేదా అనేది సినిమా చూసిన తర్వాతే చెప్పగలుగుతాం. ముందే ఎవరి వల్ల ఏమైమవుతుంది అని చెప్పలేం కదా.. కానీ నాకు తెలిసినంత వరకు రణబీర్ కపూర్ మంచి నటుడు. మంచి మనిషి కూడా. తను రాముడిగా కచ్చితంగా బాగా చేస్తాడని నేను నమ్ముతున్నాను’’ అని తెలిపారు అరుణ్. మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య ‘రామాయణ్’ను తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. అంతే కాకుండా ఈ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌ను కూడా మేకర్స్.. తమ ఔట్‌పుట్‌తోనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇప్పటికే ‘రామాయణ్’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Also Read: అయోధ్య ప్రజలు అప్పుడు రాముడికి, ఇప్పుడు మోదీకి వెన్నుపోటు పొడిచారు - రామాయణ్ నటుడి సంచలన పోస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget