Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?
Ram Pothineni and Sreeleela off to Mysore : రామ్ పోతినేని, హీరోయిన్ శ్రీ లీల కలిసి మైసూర్ వెళ్ళారు. పదిహేను రోజులు కర్ణాటకలో ఉంటారు. బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ చేయనున్నారు.
![Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే? Ram Sreeleela off to Mysore Boyapati RAPO movie team kickstarted Final Schedule Today Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/06/205af722cd075d738f92d74cb6f371581686032336060313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువ కథానాయకుడు రామ్ పోతినేని (Ram Pothineni) హుషారుకు, ఎనర్జీకి నో లిమిట్స్! బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల్లో భారీతనానికీ లిమిట్స్ ఉండవు. వీళ్ళిద్దరూ కలిస్తే... స్క్రీన్ మీద ఆటంబాంబు తరహాలో ఫైట్లు, సీన్లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాలా? అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థండర్. రామ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో గ్లింప్స్ ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే క్లారిటీ ఇచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... షూటింగ్ చివరి దశకు వచ్చింది.
శ్రీ లీలతో మైసూర్ వెళ్లిన రామ్
రామ్, బోయపాటి శ్రీను సినిమాలో శ్రీ లీల (Sreeleela) కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె, రామ్ కలిసి మైసూర్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏమిటంటే?
జూన్ 15 వరకు ఫైనల్ షెడ్యూల్!
మైసూరులో రామ్, బోయపాటి శ్రీను సినిమా ఫైనల్ షెడ్యూల్ ఈ రోజు మొదలైంది. జూన్ 15 వరకు హీరో హీరోయిన్లతో పాటు ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దాంతో ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా తీయనున్నారు.
అక్టోబర్ 20న సినిమా విడుదల!
విజయ దశమి సందర్భంగా అక్టోబర్ నెలలో బోయపాటి శ్రీను, రామ్ పోతినేని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కుమార్, జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కనుక... అన్ని భాషలకు సెట్ అయ్యే టైటిల్ బోయపాటి శ్రీను ఫిక్స్ చేశారట.
క్లైమాక్స్ కాదు... క్లై'మ్యాక్స్'
ఇటీవల పతాక సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా రామ్ చేసిన ట్వీట్ సినిమాపై అంచనాలు పెంచింది. ''ఫైనల్లీ... క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. యాక్షన్ సీక్వెన్స్ కోసం 24 రోజులు చిత్రీకరణ చేశాం. ఇది క్లైమాక్స్ కాదు... క్లైమ్యాక్స్'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. క్లైమాక్స్ అయితే 'మ్యాక్స్' అంటూ రామ్ పోతినేని మరిన్ని అంచనాలు పెంచారు.
Also Read : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?
ఫస్ట్ థండర్‌లో ''నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా! నీ గేటు దాటలేనన్నావ్... దాటా! నీ పవర్ దాటలేనన్నావ్... దాటా! ఇంకేంటి దాటేది... నా బొంగులో లిమిట్స్!'' అంటూ రామ్ చెప్పిన డైలాగ్ పాపులర్ అయ్యింది. లిమిట్స్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో యూత్ ఈ డైలాగ్ చెబుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో పేరు (రాపో - రామ్ పోతినేని) పేరు వచ్చేలా కంపోజ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. యంగ్ హీరోల్లో హీరో పేరు మీద ఈ స్థాయిలో మాస్ బీజీఎమ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఈ సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేశారు.
Also Read : మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)