By: ABP Desam | Updated at : 25 May 2023 10:28 AM (IST)
'ఆదిపురుష్'లో సీతాదేవిగా కృతి సనన్, ఆమెను వెనుక శ్రీరాముని పాత్రలో ప్రభాస్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్... 'ఆదిపురుష్' సినిమా నుంచి విడుదలైన తొలి పాట చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది.
రామ్ సియా రామ్...
రిలీజ్ ఎప్పుడంటే?
శ్రీ రామ చంద్రునిగా ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). ఇందులోని తొలి పాట 'జై శ్రీరామ్'లో 'మహిమాన్విత మంత్రం నీ నామం' అంటూ రామనామం యొక్క గొప్పదనాన్ని వివరించారు. ఆయన వెంట నడుస్తూ లంకపై యుద్ధం చేసిన వానర సైన్యం పాడిన పాటగా దానిని తీర్చిదిద్దారు. రెండో పాట సీతారాముల మీద ఉంటుందని తెలిసింది.
మే 29న మధ్యాహ్నం 12 గంటలకు 'రామ్ సియా రామ్' పాట విడుదల కానుంది. ఈ గీతానికి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా... సచేత్ పరంపర సంగీతం అందించడంతో పాటు ఆలపించారు. రేడియో స్టేషన్స్, మూవీ ఛానల్స్, నేషనల్ న్యూస్ ఛానల్స్, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, టిక్కెటింగ్ పార్ట్నర్స్, మూవీ థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్... 70కు పైగా మార్కెట్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు 'ఆదిపురుష్' టీమ్ వెల్లడించింది.
'ఆదిపురుష్' సినిమాలో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. అంటే కంటే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. అదీ తెలుగు గడ్డపై!
Also Read : 'విరూపాక్ష'లో విలన్‌ను మార్చేసిన సుకుమార్ - ఆ యాంకర్‌కు ఛాన్స్ మిస్!
తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుక!
Adipurush Pre Release Event Date : ఆధ్యాత్మిక క్షేత్రమైన, హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో కొలిచే ఏడు కొండల శ్రీవాసుడు కొలువన తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ తెలియజేసింది. జూన్ 6వ తేదీ సాయంత్రం భారీ ఎత్తున భక్తులు, ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో వేడుకగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం వెనుక ముఖ్య భూమిక పోషించిన 'బాహుబలి' సినిమా ప్రీ రిలీజ్ వేడుక సైతం తిరుపతిలో జరిగింది. మరోసారి తిరుపతి గడ్డ మీద ప్రభాస్ సినిమా వేడుకకు ఏర్పాట్లు జరుగుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 15న 'ఆదిపురుష్' ప్రీమియర్స్!
Adipurush Premiere Timings : ప్రతి సినిమా ఇండియాలో కంటే అమెరికాలోనే ముందుగా విడుదల అవుతుంది. అక్కడ ప్రీమియర్ షోలు పడతాయి. ఇప్పుడీ 'ఆదిపురుష్' షోలు సైతం అమెరికాలో ముందుగా పడుతున్నాయి. జూన్ 15వ తేదీ ఉదయం 3.30 గంటల నుంచి షోస్ మొదలు అవుతాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.
అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్ రేటు ఎంత?
Adipurush Ticket Price In USA : అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్టును 20 డాలర్లుకు అమ్ముతున్నారు. ఇది 2డి షో టికెట్ రేటు. త్రీడీ షో అయితే టికెట్ రేటు 23 డాలర్లు మాత్రమే! రీజనబుల్ రేట్లకు టికెట్స్ అమ్ముతున్నారని చెప్పవచ్చు. 'ఆర్ఆర్ఆర్' టికెట్స్ 28 నుంచి 25 డాలర్లకు అమ్మారు. దాంతో పోలిస్తే ఈ రేటు రీజనబులే కదా!
Also Read : '2018' రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా - ఎలా ఉందంటే?
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?
Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్
HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?
Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?