హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. కొన్ని రోజుల నుంచి అక్కడే మకాం వేశారు.

'మోడ్రన్ లవ్ చెన్నై' పేరుతో రూపొందిన అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ లో రీతూ వర్మ సందడి చేశారు.

'మోడ్రన్ లవ్ చెన్నై'లో మల్లిక పాత్రలో రీతూ నటించారు. తన పాత్రకు మంచి స్పందన లభిస్తోందని ఆమె తెలిపారు. 

'మోడ్రన్ లవ్ హైదరాబాద్' వెబ్ సిరీస్ లో కూడా రీతూ వర్మ నటించారు.

తెలుగుతో పాటు తమిళంలో కూడా రీతూ వర్మకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 

'కనులు కనులను దోచాయంటే', 'ఒకే ఒక జీవితం' సినిమాలు తమిళంలోనూ మంచి విజయాలు సాధించాయి.

విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న 'ధ్రువ నక్షత్రం'లో రీతూ నటిస్తున్నారు. 

'ధ్రువ నక్షత్రం' విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. లేదంటే ఆమెకు మరిన్ని పెద్ద సినిమాలు వచ్చేవని ఇండస్ట్రీ టాక్.

రీతూ వర్మ (All Images Courtesy : rituvarma / Instagram)