సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ వీళ్లే! యష్: పాన్ ఇండియన్ స్టార్ యష్ ‘నంద గోకుల’ లాంటి పలు సీరియల్స్ తో గుర్తింపు పొందారు. విజయ్ సేతుపతి: ‘నవరస’, ‘పెన్ లానె’ లాంటి పలు సీరియల్స్ లో నటించారు. ఆయుష్మాన్ ఖురానా: MTV షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి వచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్: ‘పవిత్ర రష్త’ ‘కిస్ దేశ్ మైన్’ అనే సీరియల్స్ తో పాపులర్ అయ్యారు. విద్యాబాలన్: ‘హమ్ పాంచ్’ అనే టెలీ సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టింది. ఇర్ఫాన్ ఖాన్: దివంగత ఇర్ఫాన్ ‘సలాం బాంబే’ సీరియల్ తో కెరీర్ స్టార్ట్ చేశారు. హన్సిక: ‘షకలక బూమ్ బూమ్’ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరకు పరిచయం అయ్యింది. షారుఖ్ ఖాన్: 1988లో ‘దిల్ దారియా’ అనే సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టారు. మౌనీ రాయ్: ‘కస్తూరి’, ‘నాగిని’ లాంటి పాపులర్ డైలీ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మందిరా బేడి:90వ దశకంలో ‘శాంతి’, ‘ఆహత్’, ‘ఔరత్’ సీరియల్స్ తో ఆకట్టుకుంది.