News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Ram - Krithi Shetty: ఈ 'బుల్లెట్' ఖరీదు మూడు కోట్లు, కాస్ట్‌లీ వారియర్ గురూ

రామ్ లేటెస్ట్ సినిమా 'ది వారియర్'లో 'బుల్లెట్...' సాంగ్ నిన్న విడుదల చేశారు. ఆ సాంగ్ కోసం నిర్మాత చాలా ఖర్చు పెట్టారని దర్శకుడు లింగుస్వామి వివరించారు.

FOLLOW US: 
Share:

'ఇస్మార్ట్ శంకర్'తో హీరో రామ్‌కు మాంచి మార్కెట్ పొటెన్షియల్ ఉందనేది తెలిసి వచ్చింది. స‌రైన‌ మాస్ సినిమా పడితే... మినిమమ్‌లో మినిమమ్ రూ. 50 కోట్లు వస్తాయి. హిట్ టాక్ వస్తే రూ. 75 కోట్లు గ్యారంటీ. హిందీలో మార్కెట్ ఉంది కాబట్టి డిజిటల్, శాటిలైట్ రైట్స్ బాగా వస్తాయి. అందుకని, రామ్ మీద ఖర్చు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అందుకు, ఉదాహరణ 'ది వారియర్' సినిమాలో 'బుల్లెట్...' సాంగ్.

Bullet Song - The Warriorr Movie: రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో కృతి శెట్టి కథానాయిక. వీళ్ళిద్దరి మీద 'కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్... ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్' అని ఒక పెప్పీ ఎనర్జిటిక్ సాంగ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ శింబు పాడాడు. శుక్రవారం సాంగ్ విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ప్రోగ్రామ్‌లో తమిళ్ సాంగ్‌ను హీరో, ఎమ్మెల్యే, సీయం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విడుదల చేశారు. 

ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న‌ చిత్తమిది. చెన్నై ప్రోగ్రామ్‌లో మూడు కోట్ల రూపాయల వ్యయంతో 'బుల్లెట్' సాంగ్ తెరకెక్కించినట్లు దర్శకుడు లింగుస్వామి చెప్పుకొచ్చారు. సినిమానూ గ్రాండ్‌గా తీశార‌న్నారు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమా తీస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది. రామ్‌తో ఇంత‌కు ముందు ప‌రిచ‌యం లేద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో క‌లిసిన ఐదు నిమిషాల్లో ఇద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అయ్యామని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. 

తమిళంలోనే తన తొలి సినిమా చేయాల్సిందని, ఇప్పటికి కుదిరిందని చెప్పిన రామ్... తనకు తమిళ్ మాట్లాడటం వచ్చని, చెన్నైలో పెరిగానని వివరించారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన మంచి పనులను ఆయన కొనియాడారు. లింగుస్వామి కథ చెప్పినప్పుడే ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నట్టు చెప్పారని రామ్ తెలిపారు. 
Also Read: నేను తప్పు చేయలేదు, అరెస్ట్ కాలేదు, ఎక్కడికీ పారిపోలేదు - నగరి కేసుపై జీవితా రాజశేఖర్ స్పందన

ఈ కార్యక్రమంలో దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ఆది పినిశెట్టి తదితరులు పాల్గొన్నారు. 

Also Read: 'నా పొటెన్షియల్ ఏంటో తెలిసేలా చేసింది' - 'కేజీఎఫ్2' సినిమాపై సంజయ్ దత్ కామెంట్స్

Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

Published at : 23 Apr 2022 05:27 PM (IST) Tags: Krithi Shetty ram The Warriorr Movie Bullet Song Ram's Bullet Song Costs 3cr

ఇవి కూడా చూడండి

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’  - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
×