Jeevitha Rajasekhar: నేను తప్పు చేయలేదు, అరెస్ట్ కాలేదు, ఎక్కడికీ పారిపోలేదు - నగరి కేసుపై జీవితా రాజశేఖర్ స్పందన

జీవితా రాజశేఖర్ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని, ఆమె తమకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, తమకు 20 కోట్లు ఇవ్వాలని జీస్టర్ గ్రూప్ హేమ, కోటేశ్వర్ రాజు చేసిన ఆరోపణలపై జీవిత స్పందించారు. 

FOLLOW US: 

జీవితా రాజశేఖర్ దంపతులను నమ్మి తాము రూ. 26 కోట్లు మోసపోయామని, వారితో ఎవరూ సినిమాలు తీయడానికి ముందుకు రాని సమయంలో రూ. 26 కోట్లు ఖర్చు పెట్టి 'గరుడవేగ' తీశామని, తమ దగ్గర ఆస్తులు తాకట్టు పెట్టి వాటిని వేరే వాళ్లకు అమ్మారని జీస్టర్ గ్రూప్ ఫౌండర్ కోటేశ్వర్ రాజు, ఛైర్మన్ హేమ ఆరోపించిన సంగతి తెలిసిందే. శనివారం హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన 'శేఖర్' సినిమా  విలేఖరుల సమావేశంలో ఆ ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు.

"నగరిలో కేసు జరుగుతున్న మాట వాస్తవమే. వారెంట్ వచ్చిన మాట నిజమే. అయితే, నేను అరెస్ట్ కాలేదు. అది ఎందుకు వచ్చింది? ఓ కారణం ఉంటుంది. కేసు విషయమై కోర్టు సమన్లు జారీ చేసినప్పుడు మేం కొవిడ్ తో ఇబ్బంది పడుతున్నాం.  మాకు సమన్లు అందకుండా చేశారు. విషయం తెలిశాక, మా న్యాయవాదిని పంపించాం. ఆ కేసు జరుగుతోంది. తీర్పు వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది" అని జీవితా రాజశేఖర్ తెలిపారు.

జీస్టర్ గ్రూప్ తరపున కోటేశ్వర్ రాజు సినిమా నిర్మిస్తే... హేమ ఎందుకు వచ్చారు? ఆయనపై హైదరాబాద్ లో ఏం కేసు ఉంది? ఆయన వల్ల మా మేనేజర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కోర్టులో బయటకు వస్తాయని జీవిత తెలిపారు. నగరి కోర్టులో వారెంట్ జారీ అయ్యి రెండు నెలలు అయ్యిందన్నారు. ఇప్పుడు హేమ, కోటేశ్వర్ రాజు ఎందుకు బయటకొచ్చారో తెలియదన్నారు. తనను డీమోరలైజ్, డీఫేమ్ చేయడం ఎవరి తరమూ కాదన్నారు.

"తప్పు చేసిన రోజు ఒప్పుకొనే ధైర్యం ఉంది. చేయని రోజున భగవంతుడి ముందు నిలబడి మాట్లాడే ధైర్యమూ నాకు ఉంది. వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉండి ఉంటే... కోర్టులో తీర్పు వస్తుంది కదా! అప్పుడు మాట్లాడతా" అని జీవితా రాజశేఖర్ తెలిపారు. తమపై ఆరోపణలు చేసినవాళ్ళు మహాత్ములు కాదని ఆమె అన్నారు. ఆల్రెడీ ఒకసారి కేసు ఓడిపోయారని, వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రూవ్ అవుతుందని జీవిత పేర్కొన్నారు. తాను జైలుకు వెళ్లలేదని తెలిపారు.

Also Read: 'శేఖర్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?

కొన్ని యూట్యూబ్ చాన్నాళ్లు పెట్టిన థంబ్‌నైల్స్‌పై జీవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిగా రాయమని ఆమె సున్నితంగా చెప్పారు. కేసు కోర్టులో ఉంది కనుక ఇంత కంటే  ఎక్కువ మాట్లాడలేనని జీవితా రాజశేఖర్ తెలిపారు.      

Also Read: సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్

Published at : 23 Apr 2022 02:41 PM (IST) Tags: Jeevitha Rajasekhar Check Bounce Case Jeevitha Response On Case Garudavega Movie Issue

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి