అన్వేషించండి

'పఠాన్' ఆ సౌత్ సినిమాలకి బ్రేక్ వేసింది - షారుక్ సినిమాపై RGV ప్రశంసలు!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ 'పఠాన్' సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇటీవల 'పఠాన్' సినిమాతో భారీ కం బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా ఈ ఏడాది అత్యధిక గ్రాస్ అందుకున్న చిత్రంగా నిలిచింది. అయితే ఇటీవల టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పఠాన్ తో సౌత్ సినిమాలకి బ్రేక్ పడిందని అన్నారు. ఈ మేరకు ఇటీవల ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమాని ప్రశంసిస్తూ.." ఇకపై హిందీ సినిమాలు సక్సెస్ కావు అనే కోణాన్ని 'పఠాన్' సినిమా పూర్తిగా మార్చేసింది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న వేళ జనాలు హిందీ సినిమాల జోలికి వెళ్లరనే అభిప్రాయాన్ని 'పఠాన్' పూర్తిగా మార్చేసింది. 'కాంతారా', 'ఆర్ ఆర్ ఆర్', 'కేజిఎఫ్' లాంటి సినిమాల జోరు నడుస్తున్న సమయంలో బాక్సాఫీస్ వద్ద 'పఠాన్' బ్లాక్ బస్టర్ గా నిలిచి సౌత్ సినిమాలకి బ్రేక్ వేసిందని" రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

కాగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ బాజ్ పై ఊర్మిళా మటోండ్కర్ జెడి చక్రవర్తి నటించిన 'సత్య' చిత్రం ఇటీవలే 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో రామ్ గోపాల్ వర్మ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. టాలీవుడ్లో 'శివ' సినిమాతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన రాంగోపాల్ వర్మ బాలీవుడ్ లోనూ 'రంగీలా', అమితాబ్ బచ్చన్ 'సర్కార్', 'కంపెనీ' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం బోల్డ్ సినిమాలు తీస్తూ పలు వివాదాల్లోకెక్కుతున్నారు.. ప్రస్తుతం ఆయన 'వ్యూహం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంఘటనలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక పఠాన్ విషయానికొస్తే.. షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ త్వరలోనే 'జవాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షారుక్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, సానియా మల్హోత్రా, ప్రియమణి, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే గెస్ట్ రోల్ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అనిరుద్ రవిచంద్రన్ సంగీట్తం అందిస్తున్న ఈ సినిమాని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Also Read : హర్యానా అల్లర్లపై వివాదాస్పద ట్వీట్ - తన అకౌంట్ హ్యాక్ చేశారంటూ గోవిందా ఫిర్యాదు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
I Bomma: ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
Embed widget