అన్వేషించండి

Ram Charan : పెద్ది గురించి అడిగిన ప్రధాని - మోదీ చెప్పిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీకి లింక్ ఏంటో చెప్పిన రామ్ చరణ్

Peddi Story : పెద్ది ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాని మోదీ చెప్పిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీ షేర్ చేసుకున్నారు. ఢిల్లీలో ఆయన్ను ఓసారి కలిసినప్పుడు పెద్ది గురించి అడిగినట్లు వివరించారు.

Ram Charan Reveals Interation With PM Modi Connects To Peddi Movie : తాను ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన పెద్ది సినిమా గురించి అడిగినట్లు చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రమోషన్లలో భాగంగా గురువారం ఢిల్లీలో మూవీ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీ గురించి షేర్ చేసుకున్నారు చరణ్.

ఆ ఫుట్ బాలర్... ఓ ఇన్‌స్పిరేషన్...

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు 'పెద్ది' సినిమా దేని గురించి అని అడిగినట్లు చెప్పారు చరణ్. 'పెద్ది ఓ విధంగా వికసిత్ భారత్ గురించి చెప్పే స్టోరీ అని వివరించా. గ్రామాల్లో ఉండే మట్టిలో మాణిక్యాల కథ అని చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఓ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ షేర్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఎదురైన ఓ అద్భుత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ ఓ గ్రామంలో మహ్మద్ అనే ఫుట్ బాల్ ప్లేయర్ ఉండేవాడు.

కొన్నేళ్ల క్రితమే భారత్ తరఫున ఆడాడు. అలా తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ గ్రామం నుంచి 85 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. ఓ వ్యక్తి ఎలాంటి మార్పు తీసుకు రాగలడు అనే దానికి ఇదే నిదర్శనం. పెద్ది కూడా ఓ గిరిజన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గురించిన స్టోరీనే.' అని చరణ్ తెలిపారు.

Also Read : Meri Awas Suno OTT : నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రియల్ లైఫ్ స్టోరీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్

పెద్ది ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే భోపాల్, బెంగుళూరులో ప్రమోషన్స్ కంప్లీట్ కాగా... గురువారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు. పెద్ది గురించి చరణ్, జాన్వీ కపూప్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమాలో ఇంత బాగా డ్యాన్స్ ఎలా చేశారంటూ ఎదురైన ప్రశ్నకు చరణ్... ప్రొడ్యూసర్ మంచి పేమెంట్ ఇచ్చారంటూ నవ్వులు పూయించారు.

పైరసీకి చెక్...

పెద్ది పైరసీకి చెక్ పెట్టేలా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాపీ రైట్స్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆన్ లైన్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసింది.

పెద్దిలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. 

Also Read : Blast Zone Review - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget