Peddi Release : రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
Ram Charan Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది పైరసీకి అడ్డుకట్ట వేసేలా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ ఫైల్ చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Madras High Court Grants Anti Piracy Injunction For Ram Charan Peddi Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేలా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
యాంటీ పైరసీ ఇంజంక్షన్
పెద్ది కాపీ రైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మూవీని ఆన్ లైన్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అన్ అఫీషియల్‌గా సినిమా ఇంటర్నెట్‌లో లీకైతే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడుతూ... యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసింది.
అసలేంటీ యాంటీ పైరసీ ఇంజంక్షన్
'యాంటీ పైరసీ ఇంజంక్షన్' అనేది చిత్ర నిర్మాణ సంస్థ తమ కంటెంట్ అక్రమంగా కాపీ కాకుండా, పైరసీ వెబ్‌సైట్లలో ప్రసారం కాకుండా కోర్టుల ద్వారా పొందే ఓ న్యాయపరమైన రక్షణ ఉత్తర్వులు. ఓ వెబ్ సైట్ బ్లాక్ చేసిన వెంటనే... కొత్త యూఆర్ఎల్‌తో అదే కంటెంట్ రాకుండా కొత్త సైట్లను కూడా ఆటో మేటిక్‌గా బ్లాక్ చేయడానికి ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్‌ను కోర్టులు ఇష్యూ చేస్తుంటాయి.
గత కొంతకాలంగా ఇండస్ట్రీని పైరసీ భూతం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ బారిన పడింది. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అంతే కాకుండా టీవీల్లోనూ ప్రసారమైంది. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ డేట్ రాలేదు. ఇలాంటివి జరగకుండా పెద్ది టీం రిలీజ్‌కు ముందే అలర్ట్‌గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
బుకింగ్స్ ఎప్పటి నుంచో?
మరోవైపు, పెద్ది ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా ఫుల్ జోష్‌లో సాగుతున్నాయి. ముంబైలో ట్రైలర్ లాంచ్ నుంచి స్టార్ట్ చేస్తే భోపాల్‌లో సాంగ్ ఈవెంట్, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అటు, పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30 (శనివారం) నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... జూన్ 4న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
Also Read : 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























