అన్వేషించండి

Meri Awas Suno OTT : నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రియల్ లైఫ్ స్టోరీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

Meri Awas Suno OTT Platform : 2022లో రిలీజైన మలయాళ హిట్ మూవీ 'మేరీ ఆవాజ్ సునో ' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ తాజాగా అందుబాటులోకి వచ్చింది.

Jaya Surya's Meri Awas Suno OTT Streaming After Four Years : రియల్ లైఫ్ స్టోరీ... ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ... నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పట్లో మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ మూవీ గురువారం నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.

ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

మలయాళ స్టార్ జయసూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పేరు 'మేరీ ఆవాజ్ సునో'. 2022లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ స్టోరీ ఓ ఇన్‌స్పిరేషనల్ అని మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 'ఆశ, అంతర్గత బలంతో కూడిన ఎమోషనల్ జర్నీ' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించగా... జయసూర్యతో పాటు మంజు వారియర్, శివద, ఆర్ మాధవన్, సుధీర్ కరమణ, జానీ ఆంటోని, గౌతమి నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. బి. రాకేష్ మూవీని నిర్మించగా... ఎం.జయచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను సూపర్ హిట్ బెంగాళీ మూవీ 'కంటో' ఆధారంగా రూపొందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...

స్టోరీ ఏంటంటే?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే... గొంతు క్యాన్సర్‌తో పోరాడే ఓ ఫేమస్ రేడియో జాకీ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఓ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా. శంకర్ (జయసూర్య) ఓ పాపులర్ రేడియో జాకీగా (ఆర్జే) వర్క్ చేస్తుంటాడు. తన వాయిస్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటాడు. తన మాటలతో ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గానే నిలుస్తూ... ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంటాడు. తన గొంతే అతని ప్రపంచం.

అంతా సాఫీగా జరిగిపోతుంది అనుకునే తరుణంలో శంకర్‌కు గొంతు క్యాన్సర్ అని తేలుతుంది. తన వాయిస్ శాశ్వతంగా పోతుందని తెలిశాక ఒక్కసారిగా జీవితం తలకిందులు అవుతుంది. రేడియో జాకీగా తన కెరీర్ ముగిసిపోయిందనుకుని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు శంకర్. సరిగ్గా అదే టైంలో అతని జీవితంలోకి డాక్టర్ రేష్మి (మంజు వారియర్) అడుగు పెడుతుంది. స్పీచ్ థెరపిస్ట్ అయిన ఆమె శంకర్ తన కొత్త జీవితం ప్రారంభించేలా చేస్తుంది. తనను తాను అంగీకరించేలా చేస్తుంది. మళ్లీ శంకర్ ఎలా ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Peddi Release : రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget