NTR: ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ ముద్దు - ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే.. చిరంజీవి, బాలకృష్ణ 'నాటు నాటు'కు స్టెప్పులేస్తే?
RRR Live Concert: లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన 'ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్'లో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి సందడి చేశారు. ఎన్టీఆర్‌కు స్టేజీపైనే బర్త్ డే విషెష్ చెప్పిన చరణ్ హగ్ చేసుకున్నారు.

Ram Charan Hugs NTR in RRR Live Concert: 'RRR'.. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన సినిమా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్ సొంతం చేసుకుంది. తాజాగా.. మరోసారి అంతర్జాతీయ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' ట్రెండ్ అవుతోంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్' ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హాజరయ్యారు.
ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ ముద్దు
రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిగి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (Keeravani) తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మూవీ సాంగ్స్‌తో ఎంటర్‌టైన్ చేయగా అతిథులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి వేదికపై సందడి చేశారు. చరణ్, ఎన్టీఆర్ ఎంతో సంతోషంతో కనిపించారు.
ఎన్టీఆర్‌కు (NTR) స్టేజీ మీదే చరణ్ బర్త్ డే విషెష్ చెప్పడంతో పాటు అందరితోనూ చెప్పించారు. ఎన్టీఆర్‌కు ముద్దు పెట్టి మరీ హగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాండింగ్.. ఫ్రెండ్ షిప్ అంటే ఇదీ అంటూ ఫ్యాన్స్‌తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Idhi ra Charan ante....🥹🧡
— ᴱᴸᴱⱽᴱᴺ REDDY (@11_Red_E) May 11, 2025
Charan midha Charan movies midha entha negative chepinchina big stage midha wishes cheppadu 🫡🫠
Gold @AlwaysRamCharan 😭🧡pic.twitter.com/GARJ02J4Gv
'నాటు నాటు'కు చిరంజీవి, బాలకృష్ణ స్టెప్పులేస్తే..
'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు' సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాటలో ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాట గురించి లైవ్ కాన్సర్ట్‌లో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ పాటలో తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని ఎన్టీఆర్ అన్నారు. 'మెగాస్టార్ చిరంజీవి ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికీ తెలుసు. మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్. వీళ్లిద్దరూ కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తే అది చరిత్రలో ఓ మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది.' అని అన్నారు.
దీంతో హాల్ మొత్తం అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. ఇదే సమయంలో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిలతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.
. @tarak9999 about RC, chiru and Nbk 🔥 pic.twitter.com/TspkMNcgjf
— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 11, 2025
ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరవుతారనే వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళితో 'SSMB29' మూవీ చేస్తున్నారు.





















