అన్వేషించండి

Ram Charan - Game Changer : కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సెట్స్‌కు రామ్ చరణ్ - భారీ యాక్షన్ గురూ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత విరామం తర్వాత మళ్ళీ చిత్రీకరణ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ, ఆయన ఏం చేస్తున్నారంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కొంత విరామం తర్వాత ఈ సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 

భారీ యాక్షన్ సీక్వెన్స్ గురూ!
అమ్మాయి క్లీంకార జన్మించడానికి కొన్ని రోజుల ముందు రామ్ చరణ్ షూటింగులు, ఇతర వృత్తిపరమైన పనులకు విరామం ప్రకటించారు. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన సెట్స్‌కు వస్తున్నారు. 

Game Changer New Schedule : ఈ నెల 11న (మంగళవారం) నుంచి హైదరాబాద్ సిటీలో 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇందులో రామ్ చరణ్, ఇతర ఫైటర్లు పాల్గొనగా... భారీ యాక్షన్ సన్నివేశాలు తీయడానికి ప్లాన్ చేశారు. బహుశా... క్లైమాక్స్ షూట్ కావచ్చు.   

దర్శకుడిగా శంకర్ స్టైల్ గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. యాక్షన్ సీన్స్ / ఫైట్స్, సాంగ్స్ తీయడంలో ఆయన కంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లోని పాటల్లో, ఫైటుల్లో భారీతనం కనబడుతుంది. రామ్ చరణ్ కోసం ఆయన అటువంటి భారీ ఫైట్స్, సాంగ్స్ ప్లాన్ చేశారట. ఆ మధ్య విదేశాల్లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ తీశారు. ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

Also Read : పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్ - ఈసారి హీరో ఎవరంటే?


 
ఐఏఎస్ అధికారిగా... సీయంగా!
శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్. 

ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) ఓ కథానాయిక. మరో కథానాయికగా  తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్'లో తమన్ నటించారు. ఆ తర్వాత శంకర్ నిర్మాణంలో వచ్చిన కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. అయితే... శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి.

Also Read : 'రంగబలి' దర్శకుడి జోకులకు భయపడిన సుమ - జనాలు అపార్థం చేసుకుంటే?

'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie)తో భారీ విజయం అందుకోవడం మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ అందుకున్న రామ్ చరణ్... 'గేమ్ ఛేంజర్' తర్వాత మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతుంది. దానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, నర్తన్ దర్శకత్వంలోనూ ఆయన సినిమాలు చేసే అవకాశం ఉంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Embed widget