![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Game Changer Teaser Release Date: గ్లోబల్ స్టార్ దీపావళి ధమాకా... టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ లుంగీ లుక్ మామూలుగా లేదమ్మా
Ram Charan New Poster: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ 'గేమ్ చేంజర్' సినిమా యూనిట్ మామూలు గిఫ్ట్ ఇవ్వలేదు. కొత్త పోస్టర్ విడుదల చేయడంతో పాటు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
![Game Changer Teaser Release Date: గ్లోబల్ స్టార్ దీపావళి ధమాకా... టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ లుంగీ లుక్ మామూలుగా లేదమ్మా Ram Charan fans go gaga over hero new lungi look in Game Changer teaser release date poster Game Changer Teaser Release Date: గ్లోబల్ స్టార్ దీపావళి ధమాకా... టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ లుంగీ లుక్ మామూలుగా లేదమ్మా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/31/1a5d93d37ed1a28c4c8966af894fb75f1730374166908313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగా అభిమానులకు అసలైన దీపావళి ధమాకా అందించింది 'గేమ్ చేంజర్' (Game Changer) సినిమా యూనిట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మాస్ లుక్ బయటకు వదిలింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఆ లుక్ వెనుక రీజన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
నవంబర్ 9న 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల
దీపావళికి 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల కానుందని ప్రచారం జరిగింది. అయితే... అటువంటిది ఏమీ లేదు. ఈ రోజు టీజర్ విడుదల కాలేదు. కానీ ఎప్పుడు విడుదల చేసేది ప్రేక్షకులకు తెలిపింది సినిమా యూనిట్.
Game Changer Teaser Release Date: నవంబర్ 9న 'గేమ్ చేంజర్' టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది. గళ్ళ లుంగీ కట్టి, బ్లాక్ బనియన్ వేసి, రైల్వే ట్రాక్ మీద విలన్లను వరుసగా పడుకోబెట్టి వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా రామ్ చరణ్ కనిపించారు. ఈ లుక్ అభిమానులు అందరికీ ఫుల్ ఖుషి అందించిందని చెప్పాలి.
సివిల్ సర్వెంట్ కథతో 'గేమ్ చేంజర్' రూపొందుతోంది. రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వరకు రాజకీయ నాయకుడిగా కాసేపు సందడి చేయనున్నారు. ఇప్పటి వరకు సినిమా టీం విడుదల చేసిన పోస్టర్స్ అన్నీ కూడా క్లాసీగా ఉన్నాయి. పాటల్లో పోస్టర్లు కాస్త కలర్ ఫుల్ గా కనిపించినప్పటికీ... అందులోనూ ఒక క్లాస్ ఫీలింగ్ ఉంది. కానీ ఈ గళ్ళ లుంగీ పోస్టర్ మాత్రం మామూలు మాస్ కాదు. మాస్ ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ అని చెప్పాలి.
రైల్వే ట్రాక్ మీద ఫైట్ ఉందా? హై ఇస్తుందా?
'గేమ్ చేంజర్' సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా గురించి చేసే ఒక్కో ట్వీట్ అంచనాలు మరింత పెంచుతోందని చెప్పాలి. టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ ట్వీట్ చేసిన ఆయన ఈ ట్రైన్ ఫైట్ హై ఇస్తుందని చెప్పారు. సో ఈ స్టిల్ ఫైట్ సీక్వెన్స్ నుంచి తీసిందని చెప్పవచ్చు.
This Train 🚂 FIGHT High O high !! 🔥 🔥🔥🔥🔥#GameChanger Teaser ON 9-11-2024 !! Let’s HIT IT #GameChangerTeaser 💥💥💥💥💥 pic.twitter.com/MmVX9Vku6y
— thaman S (@MusicThaman) October 31, 2024
శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంస్థలపై 'దిల్' రాజు, శిరీష్ సోదరులు 'గేమ్ చేంజర్'ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తొలుత ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20నా లేదా 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని సంక్రాంతికి సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించగా... అంజలి ఓ ప్రధాన పాత్ర పోషించారు. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
Also Read: క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)