Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న గ్లోబల్ స్టార్
Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. అందుకే వారికోసం ట్రిపుల్ ట్రీట్ ఇవ్వాలని చరణ్ మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు.
Ram Charan Birthday Special Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేకు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో దీనిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇక తన ఫ్యాన్స్‌ను సంతోషపెట్టడం కోసం చరణ్ కూడా ఏకంగా మూడు అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘ఆర్‌సీ 16’ పూజా కార్యక్రమాన్ని చేసిన ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు ఈ హీరో. ఇప్పుడు మరికొన్ని అప్డేట్స్ ఇచ్చి ట్రిపుల్ ధమాకాకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా తన మార్కెట్ పెరగడంతో మార్చి 27న రామ్ చరణ్ పుట్టిరోజును కేవలం ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇన్నాళ్లకు మొదటి పాట..
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ ఆగిపోయిందని, అసలు షూటింగ్ జరగడం లేదని.. ఇలా ఎన్నో రూమర్స్ కొన్నాళ్ల క్రితం వైరల్ అయ్యాయి. కానీ అవేవి నిజం కాదని తేలిపోయింది. ఇటీవల వైజాగ్‌లో ‘గేమ్ ఛేంజర్’ ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. షూటింగ్ మళ్లీ ప్రారంభం కావడంతో ఇప్పటికైనా దీని నుండి అప్డేట్స్ ఏమైనా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అందుకే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ నుండి పాటను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలోని ‘జరగండి’ అనే పాట.. ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ విడుదల అవ్వలేదు.
పూజా కార్యక్రమంతో సర్‌ప్రైజ్..
‘గేమ్ ఛేంజర్’ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. అసలు ఇందులో పాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే అప్పుడెప్పుడో విడుదల కావాల్సిన ‘జరగండి’ పాటను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దానితో పాటు ‘ఆర్‌సీ 16’ పూజా కార్యక్రమంతో బర్త్ డే కంటే ముందే ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు చరణ్. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనుంది. ఏ ఆర్ రెహమాన్.. ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. వీరంతా కూడా ‘ఆర్‌సీ 16’ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ మూవీకి సీక్వెల్..
‘గేమ్ ఛేంజర్’, ‘ఆర్‌సీ 16’ అప్డేట్స్‌ను రామ్ చరణ్ ఫ్యాన్స్ ముందుగానే ఊహించారు. కానీ అనుకోకుండా ఒక ట్రిపుల్ ధమాకా అప్డేట్.. వారిని పలకరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో 2018లో విడుదలయిన ‘రంగస్థలం’ మూవీ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రేక్షకులకు తెలుసు. అయితే దానికి సీక్వెల్ తెరకెక్కనుందని టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం 2’ అనే టైటిల్‌తో సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇక నిజంగానే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా లేదా తెలుసుకోవాలంటే రామ్ చరణ్ పుట్టినరోజు వరకు వేచి చూడాల్సిందే.
Also Read: ‘మోత మోగిపోద్ది’ అంటున్న విశ్వక్ సేన్ - ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ స్పెషల్ సాంగ్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్