Rakshit Shetty: ఆమె కలలు పెద్దవి - రష్మిక గురించి షాకింగ్ విషయం బయపెట్టిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి
ప్రేమించి, తమ ప్రేమను ఎంగేజ్‌మెంట్ వరకు తీసుకొని వెళ్లి.. ఆ తర్వాత విడిపోయిన జంట రక్షిత్ శెట్టి, రష్మిక. తాజాగా రష్మిక గురించి రక్షిత్ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
కొందరు హీరోహీరోయిన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి వారు ఆఫ్ స్క్రీన్ కూడా కపుల్ ఏమో అని ప్రేక్షకులు అనుకుంటారు. రూమర్స్ మొదలవుతాయి. అందులో కొన్ని రూమర్స్ నిజమవుతాయి కూడా. కానీ అలా ప్రేమించుకోవడం మొదలుపెట్టిన ప్రతీ హీరోహీరోయిన్ ప్రయాణం పెళ్లి వరకు వెళ్లే ఛాన్స్ ఉండదు. కొందరు రిలేషన్‌షిప్ మొదట్లోనే విడిపోతే.. కొందరు మాత్రం తమ ప్రేమ గురించి అందరికీ అనౌన్స్ చేసిన తర్వాత విడిపోతారు. అలా విడిపోయిన వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందనా కూడా ఒకరు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత తనతో విడిపోయి పూర్తిగా కన్నడ ఇండస్ట్రీకి చాలాకాలం వరకు దూరంగా ఉంది రష్మిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం రష్మికకు తనతో ఎలాంటి రిలేషన్ ఉంది అని బయటపెట్టాడు రక్షిత్.
రష్మిక మందనా, రక్షిత్ శెట్టి కలిసి ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రంలో నటించారు. ఇది హీరోయిన్‌గా రష్మికకు మొదటి చిత్రం. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ముందుగా ఫ్రెండ్స్ అయ్యి.. తర్వాత లవర్స్ అయ్యారు. అంతే కాకుండా జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ‘కిరిక్ పార్టీ’ విడుదలయిన కొన్నిరోజులకే రక్షిత్, రష్మిక ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత రష్మికకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. దీంతో రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుందని, కెరీర్‌పై ఫోకస్ చేయాలనుకుంది అని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. మెల్లగా అదే నిజమయ్యింది. కానీ సందర్భం వచ్చిన ప్రతీసారి రక్షిత్ మాత్రం కన్నడ మీడియా ముందు రష్మిక గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తాజాగా మరోసారి తన గురించి చెప్పుకొచ్చాడు.
టచ్‌లో ఉన్నాం..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రక్షిత్‌కు రష్మికతో ఇంకా టచ్‌లో ఉన్నారా అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా ‘‘అవును, రష్మిక, నేను ఇంకా టచ్‌లో ఉన్నాం. తనకు సినిమా ప్రపంచంలో పెద్ద కలలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ కలవైపు అడుగులేస్తోంది. అనుకున్న టార్గెట్‌ను అందుకునే సామర్థ్యం తనకు ఉంది. తన గెలుపుకు మనం తన భుజం తట్టాలి’’ అని మరోసారి రష్మికకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు రక్షిత్. వారు విడిపోయినప్పటి నుండి రష్మిక సినిమా ఏది విడుదలయినా కూడా రక్షిత్ మాత్రం తనకు ఓపెన్‌గానే ఆల్ ది బెస్ట్ చెప్తూ వచ్చాడు. అంతే కాకుండా తన పర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తూ పోస్టులు కూడా చేశాడు.
ఇద్దరూ బిజీనే..
ప్రస్తుతం రక్షిత్, రష్మిక.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. రష్మిక.. పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేస్తూ ముందుకెళ్తోంది. ఇక రక్షిత్ శెట్టి కూడా కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ‘చార్లీ’ చిత్రంతో రక్షిత్.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక తాజాగా తను కన్నడలో తెరకెక్కించిన ‘సప్త సాగర్దాచే ఎల్లో సైడ్ ఏ’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో దానిని ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌తో డబ్ చేశారు. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ సూపర్‌హిట్‌ను సాధించింది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial