అన్వేషించండి

Operation Raavan: చంపిన శవాన్ని కూడా ద్వేషిస్తున్నాడు - ఇంతకి హంతకుడు ఎవరు?, ఉత్కంఠ పెంచుతున్న ఆపరేషన్‌ రావణ్‌ ట్రైలర్‌

Operation Raavan Trailer Out: రక్షిత్‌ అట్లూరి హీరోగా క్రైం థ్రిల్లర్‌గా తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆపరేషన్‌ రావణ్‌'. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం. 

Operation Raavan Trailer Release: రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు స్వయంగా రక్షిత్‌ తండ్రి వెంకట సత్య దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంతోనే ఆయన డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. ఆగస్ట్‌ 2న మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌తో ఆద్యాంతం ఆసక్తిని పెంచుతుంది.

నేడు హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈ ఈవెంట్‌కి యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశాడు.  ‘ఈ చదరంగంలో కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క సెగ్మెట్‌తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటుకి చేరిపోతాయి’ అనే ఓ గంభీరమైన గొంతుతో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ సిటీలో ఎప్పుడు లేనటువంటిగా ఓ సీరియల్‌ కిల్లర్‌ .. అంటూ జర్నలిస్ట్‌ మూర్తి కనిపించడం ఆసక్తిగా పెంచింది. 

సిటీలో వరుస హత్యలు జరగడం.. ఆ సీరియల్‌ కిల్లర్‌  పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం.. హీరో ఛేజింగ్‌.. ఇలా ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అసలు ఈ కిల్లర్‌ ఎవరూ, అతడు ఈ హత్యలు చేయడానికి కారణం ఏంటీ? అనేది సస్పెన్స్‌. మొత్తానికి క్రైం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌ పెంచుతూ ఉత్కంఠగా సాగింది. ఇక ట్రైలర్‌ చివరిలో "చంపిన శవాన్ని కూడా ద్వేషిస్తున్నాడు.." అనే డైలాగ్‌ ఆసక్తిని పెంచుతుంది. ఇంతకి ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? దారుణ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? అనేది తెలియాలంటే  ‘ఆపరేషన్‌ రావణ్‌’ చిత్రం చూడాల్సిందే.  ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రైమ్‌  సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో తమిళ నటుడు విద్యా సాగర్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, రఘు కుంచే వంటి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆగస్ట్‌ 2న తెలుగుతో పాటు తమిళంలో ఈ మూవీ విడుదల కానుంది. 

Also Read: చావును ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం - ఉత్కంఠ పెంచుతున్న 'తంగలాన్‌' ట్రైలర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Embed widget