అన్వేషించండి

Jithender Reddy Glimpse: ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పిన నాయకుడి కథ

Rakesh Varre New Movie: 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో 'బాహుబలి', 'ఎవరికీ చెప్పొద్దు' ఫేమ్ రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి'. తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ. రొమాంటిక్ లవ్ స్టోరీలు తీసిన ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'జితేందర్ రెడ్డి'. ఇందులో 'బాహుబలి'లో కీలక పాత్రతో పాటు 'ఎవరికీ చెప్పొద్దు'లో హీరోగా నటించిన రాకేష్ వర్రె టైటిల్ రోల్ చేశారు. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలంగాణలో 1980వ కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా ఇది. తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.

మిమ్మల్ని క్షమించడం అహింస కాదు... అధర్మం!
Jithender Reddy Glimpse Review: 'జితేందర్ రెడ్డి' గ్లింప్స్ విషయానికి వస్తే... ఓ  వ్యక్తి ఆత్మహత్యతో మొదలైంది. ఆ తర్వాత మరొకరి మరణాన్ని చూపించారు. అవి చూసిన ఓ బాలుడితో 'నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పాలి' అని సుబ్బరాజు చెబుతారు. పెరిగి పెద్దయిన తర్వాత ఆ బాలుడు ఏం చేశాడు? అనేది కథగా తెలుస్తోంది. 

'మిమ్మల్ని క్షమించడం అహింస కాదు... అధర్మం' అంటూ రాకేష్ వర్రె ఎవరినో షూట్ చేసే డైలాగుతో గ్లింప్స్ ఎండ్ చేశారు. అయితే... ఈ గ్లింప్స్ అంతటా కెమెరా వర్క్ హైలైట్ ఉందని చెప్పాలి. వీఎస్ జ్ఞానశేఖర్ ఒక మూడ్ సెట్ చేశారు. హీరో చేతికి రుద్రాక్ష మాల, రైతు ఉద్యమం, అన్నల పోరాటం కూడా టచ్ చేసినట్టు తెలుస్తోంది. మే 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Also Read: 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి సినిమా చూసి ఏమన్నారంటే?

'జితేందర్ రెడ్డి' సినిమా గురించి నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... ''ప్రజలు తెలుసుకోవాల్సిన చరిత్ర జితేందర్ రెడ్డి జీవితం. ఆయన గురించి తెలిసి ఈ సినిమా చేస్తానని విరించి వర్మ ముందుకు వచ్చారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రె జీవించారు. మొదట షార్ట్ ఫిలిం చేయాలనుకున్నా. కానీ, జితేందర్ చేసిన మంచి, ప్రజలకు చేసిన సేవ తెలియాలని సినిమా చేశాం. భగత్ సింగ్, అల్లూరి తరహాలో సినిమా విడుదలైన తర్వాత జితేందర్ రెడ్డి కూడా ప్రజలకు గుర్తు ఉంటారు'' అని చెప్పారు. తాను పోలీసుగా పలు సినిమాల్లో నటించినా... ఈ సినిమాలో గుర్తుండిపోయే పోలీస్ రోల్ చేశానని నటుడు రవిప్రకాష్ చెప్పారు.

Also Readవిజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్

Jithender Reddy Glimpse: ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పిన నాయకుడి కథ
హీరో రాకేష్ వర్రె మాట్లాడుతూ... ''నేను 'మిర్చి', 'బాహుబలి'తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు దగ్గరయ్యా. 'ఎవరికీ చెప్పొద్దు'తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. నన్ను ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గారు రిఫర్ చేశారు. ఆయనతో పాటు నిర్మాత రవీందర్ రెడ్డి గారు, దర్శకుడు విరించి వర్మ, ఉమా & వాణి గారు లేకపోతే సినిమా లేదు. ఈ కథ నచ్చడంతో అప్పటికే ఓకే చేసిన రెండు సినిమాలు పక్కనపెట్టి ఈ సినిమా చేశా. ప్రేక్షకులు అందరికీ సినిమా నచ్చుతుంది'' అని చెప్పారు.


''గతంలో నేను చేసిన సినిమాలు హ్యూమర్ టచ్ ఉన్న లవ్ స్టోరీస్. హ్యూమరే కాదు, హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా కూడా నాకు ఇష్టం. జ్ఞాన శేఖర్ గారు ఫోన్ చేసి 'ఒక కథ ఉంది. నువ్వు డైరెక్ట్ చేయాల'ని చెప్పారు. కథ వినడానికి వెళ్ళినప్పుడు బుక్ ఇచ్చి చదువుకోమన్నారు. కథ చదివా. జితేందర్ రెడ్డి గారిది పవర్ఫుల్ క్యారెక్టర్. నేను కూడా కొంత రీసెర్చ్ చేశా. అందరికీ నచ్చే చిత్రమిది'' అని చెప్పారు.


రాకేష్ వర్రే హీరోగా, రియా సుమన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో 'ఛత్రపతి' శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాణిశ్రీ పొడుగు, సహ నిర్మాత: ఉమ రవీందర్, ఛాయాగ్రహణం: విఎస్ జ్ఞానశేఖర్, సంగీతం: గోపి సుందర్, నిర్మాణం: ముదుగంటి రవీందర్ రెడ్డి, దర్శకత్వం: విరించి వర్మ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget