NTR - Rajiv Kanakala : చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ మౌనమేల - రాజీవ్ కనకాల ఏం చెప్పారంటే?
చంద్రబాబు అరెస్ట్, తదనంతర రాజకీయ పరిణామాలపై ఎన్టీఆర్ స్పదించలేదు. ఆ మౌనం ఎందుకని విమర్శలు కొన్ని వచ్చాయి. ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని తాజా ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల వెల్లడించారు.
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాయకులలో నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఒకరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్... ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇటీవల ఆయన అరెస్ట్ అయిన విషయం ప్రజలకు తెలుసు. ప్రస్తుతం ఏపీలోని అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా చంద్రబాబు అరెస్టును తెలుగు దేశం పార్టీ శ్రేణులు చూస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ అన్యాయమని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, నటులు మురళీ మోహన్ తన స్పందన వ్యక్తం చేశారు. తెలుగు వాడైన తమిళ హీరో విశాల్, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబును ప్రెస్‌మీట్‌లలో విలేకరులు ప్రశ్న అడగ్గా... చంద్రబాబు అరెస్ట్ మీద స్పందించారు. అయితే... తెలుగు దేశం పార్టీ స్థాపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
హీరోగా కాకపోయినా కనీసం కుటుంబ సభ్యుడిగా మావయ్య చంద్రబాబు అరెస్ట్ మీద ఎన్టీఆర్ స్పందించకపోవడం దారుణమని కొందరు కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే... జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు, నటుడు రాజీవ్ కనకాల తాజా ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు.
సినిమాల్లో బిజీగా ఉండటంతో...
సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ స్పందించలేదేమో అని తాను భావిస్తున్నట్లు రాజీవ్ కనకాల (Rajiv Kanakala) పేర్కొన్నారు. ''తారక్ స్పందించక పోవడానికి నేను అనుకుంటున్న కారణాలు ఏమిటంటే... 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' కోసం చాలా సమయం కేటాయించారు. ఆ సినిమా కోసం నాలుగు సంవత్సరాలో, మూడు ఏళ్లో పట్టింది. లేదంటే ఆ సమయంలో మూడు నాలుగు సినిమాలు చేసేవాడు. 'ఆర్ఆర్ఆర్' చేసిన టైంలో ఎక్కువ సినిమాలు చేసేవాడు. ఇప్పుడు 'దేవర' కోసం కూడా ఏడాదికి పైగా పడుతుంది. బిగ్ కాన్వాస్ మీద భారీ ఎత్తున తీస్తున్నారు. పైగా, అతనికి నటన అంటే విపరీతమైన ఇష్టం! రాజకీయాల్లోకి రావడానికి ఇంకా టైం ఉంది. యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చేయడంతో రాజకీయాల మీద స్పందించలేదని నేను అనుకుంటున్నా'' అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
Also Read : 'కన్నప్ప'లో కన్నడ సూపర్ స్టార్ - సినిమా రేంజ్ పెంచేస్తున్న విష్ణు మంచు!
ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... 'దేవర'ను రెండు భాగాలుగా చేస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ ఓ వీడియో విడుదల చేశారు. ఆ సినిమా తర్వాత 'కెజియఫ్', 'సలార్' చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. హిందీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా 'వార్ 2' కూడా ఉంది. ప్రెజెంట్ ఎన్టీఆర్ లైనప్ భారీగా ఉంది.
Also Read : ఫ్లైట్‌లో హీరోయిన్‌ను వేధించిన పాసింజర్ - ఎయిర్ హోస్టెస్‌కి కంప్లైంట్ చేస్తే అలా చేస్తారా?
రాజీవ్ కనకాల చెప్పినట్లు 'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీఆర్ ఎక్కువ టైం కేటాయించారు. ఆ తర్వాత కూడా కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఇకపై గ్యాప్ ఉండకూడదని ఎన్టీఆర్ బలంగా ఫిక్స్ అయ్యారట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial