Rajinikanth: నా జుట్టు ఊడిపోయింది... నాగ్ ఇంకా యంగ్‌గానే ఉన్నారు - కింగ్‌పై తలైవా రజినీకాంత్ ప్రశంసలు
Coolie Pre Release Event: కింగ్ నాగార్జునపై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. సైమన్ రోల్ తానే చేయాలన్న ఆసక్తి కలిగిందని... నాగ్ అద్భుతంగా నటించారని కొనియాడారు.

Rajinikanth About Nagarjuna In Coolie Movie: ఎన్నేళ్లైనా నాగార్జున అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఫిట్‌గా ఉన్నారని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 'కూలీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ వీడియోలో మాట్లాడిన ఆయన... నాగ్‌పై ప్రశంసలు కురిపించారు. 33 ఏళ్ల కిందట తామిద్దరం కలిసి సినిమా చేశామని... అప్పుడు, ఇప్పుడు ఆయనలో జోష్ తగ్గలేదన్నారు తలైవా.
నా జుట్టు ఊడిపోయింది
'కూలీ' మూవీలో సైమన్ నెగిటివ్ రోల్‌కు నాగార్జునను అనుకుంటున్నట్లు లోకేశ్ చెప్పగానే తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు రజినీకాంత్. 'నాగార్జున ఒప్పుకుంటారా? లేదా ? అనే సందేహాలు ఉన్నప్పటికీ లోకేశ్ తనను ఒప్పిస్తారనే నమ్మకంతోనే ఉన్నా. అలానే జరిగింది. ఆయన ఈ రోల్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించా. ఎప్పుడూ మంచివాడిగానే చేయాలా? అని సైమన్ పాత్రకు ఆయన ఒప్పుకొని ఉంటారు. 33 ఏళ్ల కిందట మేం మూవీ చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.
నాకు జుట్టు కూడా ఊడిపోయింది. నాగార్జున ఇంకా యంగ్, ఫిట్‌గా ఉన్నారు. ఆయనతో పని చేస్తుండగానే 'మీ ఆరోగ్య రహస్యం ఏంటి?' అని అడిగాను. దీనికి నాగ్... 'ఏమీ లేదు సర్.. వ్యాయామం, స్విమ్మింగ్, కొద్దిగా డైట్. ఈవినింగ్ 6 గంటలకే డిన్నర్ అయిపోతుంది. నా తండ్రి నుంచి వచ్చిన జీన్స్ కూడా ఓ రీజన్. బయట విషయాలు తలకు ఎక్కించుకోవద్దని మా నాన్న చెప్పారు.' అని చెప్పారు.' అంటూ తెలిపారు రజినీ.
భాషా - ఆంటోనీ... కూలీ - సైమన్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ 'కూలీ' స్టోరీ చెప్పగానే సైమన్ పాత్రను తానే చేయాలని అనిపించిందని... ఆ రోల్ నాగార్జున పోషించి అదరగొట్టారని అన్నారు రజినీకాంత్. 'చాలా స్టైలిష్‌గా ఉండే ఈ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురుచూశా. ఈ రోల్ కోసం ఓ యాక్టర్‌తో ఆరుసార్లు సిటింగ్ అయినా ఓకే అవ్వలేదని లోకేశ్ నాతో అన్నారు. ఆయనే నాగార్జున. ఆ తర్వాత నాగ్ ఒప్పుకొన్నారని తెలిసి చాలా ఆనందపడ్డా. 17 రోజుల షూటింగ్ షెడ్యూల్ కోసం ఇద్దరం థాయ్‌లాండ్ వెళ్లాం.
సైమన్ పాత్రలో నాగార్జున యాక్టింగ్ చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. ఆ షెడ్యూల్ నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోల్‌లో నాగ్ అద్భుతంగా నటించారు. భాషా - ఆంటోనీ ఎలాగో... కూలీ - సైమన్ కూడా అలాగే ఉంటుంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది.' అని చెప్పారు.
తెలుగులో రాజమౌళి... తమిళంలో లోకేశ్
తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి ఎలానో తమిళంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అలా అంటూ ప్రశంసలు కురిపించారు రజినీ కాంత్. 'లోకేశ్ చేసిన సినిమాలన్నీ భారీ హిట్. ఈ మూవీలో చాలా మంది స్టార్స్ నటించారు. చాలా ఏళ్ల తర్వాత సత్యరాజ్‌తో చేస్తున్నా. ఆమిర్ ఖాన్ స్పెషల్ ఎప్పియరెన్స్ అదిరిపోతుంది. శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్‌లు కూడా అద్భుతంగా నటించారు.' అని అన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా 4 భాషల్లో రిలీజ్ కానుంది.





















