అన్వేషించండి

Jailer: రజనీకాంత్ కీలక నిర్ణయం, నాలుగేళ్ల తర్వాత మళ్లీ అక్కడికి - ‘జైలర్’ రిలీజ్‌కు ముందే ప్రయాణం

అమెరికాలో అయితే ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది ‘జైలర్’. అయితే సినిమా విడుదల దగ్గర పడడంతో రజినీ హిమాలయాలకు పయణమయ్యారు.

రజినీకాంత్ సినిమా విడుదల అంటే ఆ హడావిడే వేరు. ఇప్పటికే అభిమానులు రజినీని స్క్రీన్‌పై చూసి రెండేళ్లు అవుతోంది. అందుకే ‘జైలర్’ కోసం వారంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 10న పాన్ ఇండియా స్థాయిలో ‘జైలర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది ఈ చిత్రం. అమెరికాలో అయితే ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది ‘జైలర్’. అయితే సినిమా విడుదల దగ్గర పడడంతో రజినీ హిమాలయాలకు పయణమయ్యారు. తనకు సమయం దొరికినప్పుడల్లా ఇలా హిమాలయాలకు వెళ్లిపోవడం సూపర్ స్టార్‌కు అలవాటే.

నాలుగేళ్ల గ్యాప్ తర్వాత..
అన్నింటికంటే మనశ్శాంతికి ఉండడం ముఖ్యం అని నమ్మే నటుడు రజినీకాంత్. అందుకే తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావిడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్లే రజినీకాంత్.. కోవిడ్ పరిస్థితి వల్ల గత నాలుగేళ్ల నుంచి వెళ్లడం కుదరలేదు. అందుకే ‘జైలర్’ రిలీజ్ ఉన్నా సరే ఈ ఏడాది చాలా గ్యాప్ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయారు రజినీ. హిమాలయాలు అని మాత్రమే కాదు.. ఈ సూపర్ స్టార్‌కు దేవాలయాలను సందర్శించడం కూడా చాలా ఇష్టం అని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయ్యింది.

కలెక్షన్స్ విషయంలో..
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’.. ప్రపంచవ్యాప్తంగా చాలా స్క్రీన్స్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. మామూలుగా రజినీకాంత్ సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అది కూడా నెల్సన్ దిలీప్‌కుమార్ లాంటి ఒక పక్కా కమర్షియల్, ఎంటర్‌టైనింగ్ దర్శకుడితో చేతులు కలిపి రజినీ తెరకెక్కించిన సినిమా కాబట్టి దీనిపై అంచనాలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. అసలు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ‘జైలర్’పై ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో ప్రీ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రజినీకాంత్ కెరీర్‌లో ఇటీవల విడుదలయిన సినిమాల్లో ‘జైలర్’ మాత్రమే చాలా భారీ ఎత్తులో విడుదల అవుతోంది.

అక్కడ కూడా హైప్..
‘జైలర్’లో రజినీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా కోసం ప్రతీ ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులను దింపాడు దర్శకుడు నెల్సన్. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృ‌ష్ణన్.. ఇలా స్క్రీన్ మొత్తాన్ని సీనియర్ నటీనటులతో నింపేశాడు. మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, కోలీవుడ్ నుంచి రజినీకాంత్, శాండిల్‌వుడ్ నుంచి శివరాజ్‌కుమార్.. ఇలా మూడు ఇండస్ట్రీల నుంచి మూడు పెద్ద యాక్టర్లు కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. వేరే ఇండస్ట్రీ నుంచి ఇలా స్టార్ హీరోలను క్యాస్ట్ చేయడం వల్ల అక్కడ కూడా సినిమాకు హైప్ బాగానే క్రియేట్ అయ్యింది. ఇక ‘జైలర్’ విడుదల కారణంగా చెన్నై, బెంగుళూరులోని పలు ఆఫీసులకు సెలవులు కూడా ప్రకటించారు.

Also Read: ప్రముఖ దర్శకుడు మృతి - విషాదంలో సినిమా ఇండస్ట్రీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget