Happy Birthday Rajinikanth: హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్: విలాసవంతమైన విల్లా, లగ్జరీ కార్లు - రజనీకాంత్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Rajinikanth Birthday: దేశంలో అత్యధిక రెమ్యునరేష్ తీసుకునే హీరోలలో రజనీకాంత్ ఒకరు. ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైనే తీసుకుంటారు. ఇంతకీ ఈ సూపర్ స్టార్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Rajinikanth Net Worth: రజనీకాంత్.. ప్రాంతాలు, సరిహద్దులతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులకు సంపాదించుకున్న గొప్ప నటుడు. ఆయన అద్భుత నటన, అంతకు మించిన మేనరిజంతో ప్రేక్షకుల హృదయాలను చూరగొన్నారు. ఆయన స్టైల్ కు పడిపోని ఆడియెన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. పేరుకు ఆయన తమిళ సినిమా పరిశ్రమకు చెందినా, దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. జపాన్, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లోనూ ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయి. రోజు వారి కూలీగా, కార్పెంటర్ గా, బస్ట్ కండక్టర్ గా పని చేసిన రజనీ, సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి సూపర్ స్టార్ గా ఎదిగారు. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నట జీవితాన్ని మొదలు పెట్టి, అంచలు అంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన రజనీకాంత్
ఆయన నటించిన ఎన్నో చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఆయన సినిమాలతో ఎంతో మంది దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1975లో ‘అపూర్వ రాగంగళ్’ అనే తమిళ చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రయాణం ఇప్పుడు 172వ సినిమా వరకు చేరింది. తొలుత చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. ‘అన్నామలై’(1992), ‘బాషా’(1995), ‘మన్నన్’(1992), ‘చంద్రముఖి’(2005), ‘శివాజీ’(2007) లాంటి అద్భుత సినిమాలతో సినీ అభిమానులను అలరించారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘జైలర్’ చిత్రం దేశ వ్యాప్తంగా సంచనల విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.1000 కోట్లు వసూళు చేసింది. ఈ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
రజనీకాంత్ ఆస్తుల విలువ ఎంత?
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 2010లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించింది. అతడి నికర ఆస్తుల విలు 52 మిలియన్ డాలర్లు అని వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 430 కోట్లు. గత కొంతకాలంగా రజనీకాంత్ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒకవేళ సినిమా బాగా ఆడకపోతే మాత్రం తను తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారు.
పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన బంగళా
రజనీకాంత్ కు చెన్నై పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన బంగళా ఉంది. 2002లో రజనీకాంత్ ఈ బంగళాను నిర్మించుకున్నారు. దీని విలువ 4.2మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.35కోట్లు. ఆయనకు చైన్నైలో రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం ఉంది. ఇందులో 275 మంది వీఐపీలు, 1000 మంది జనాలు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ కళ్యాణ మండపం విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
రజనీ గ్యారేజీలో లగ్జరీ కార్లు
రజనీకాంత్ దగ్గర పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో 2 రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్ విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ధర రూ.16.5 కోట్లు ఉంటుంది. వీటితో పాటు రూ. 1.77 కోట్ల విలువైన BMWx5, రూ.2.55 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్, రూ. 3.10 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని లాంటి కార్లు ఆయన గ్యారేజీలో కొలువుదీరాయి.
Read Also: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్