Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్ పాత్రపై రాజమౌళి వ్యాఖ్యలు - రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్
RRR Movie: రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఉంది. ఇదే విషయంపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు చరణ్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
Rajamouli about NTR in RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దాదాపు రెండేళ్లు అయ్యింది. అయినా చాలామంది ప్రేక్షకులు ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఒక్క సినిమా ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లను గ్లోబల్ స్టార్లను చేసింది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కలిసి మంచి స్నేహితులుగా పాత్రలు పోషించినా.. బయట మాత్రం ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రం పెద్ద వివాదాలే జరిగాయి. సినిమాలో ఈ ఇద్దరి హీరోల్లో ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఇక ఈ విషయంపై దర్శక ధీరుడు రాజమౌళి సైతం స్పందించారు.
రామ్ చరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత..
‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, ఎన్‌టీఆర్.. ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఇచ్చారు రాజమౌళి. కానీ ఫ్యాన్స్‌కు మాత్రం అలా అనిపించలేదు. రామ్ చరణ్ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా ఉందని, క్లైమాక్స్‌లో తనను దేవుడిగా చూపించి హైప్ క్రియేట్ చేశారని ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఫీలయ్యారు. ప్రీ క్లైమాక్స్‌లో అదిరిపోయే బీజీఎమ్‌తో రామ్ చరణ్ ఫైట్ చేస్తుండగా.. ఎన్‌టీఆర్ మాత్రం కొలనులో దాక్కొని ఉంటాడు. ఆ సీన్ ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా దీనిపై స్పందిస్తూ.. ఇద్దరి పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఉండే విధంగానే కథను రాసుకున్నానని తెలిపారు. ఇక ఈ విషయంపై రాజమౌళి కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ది సపోర్టింగ్ క్యారెక్టర్ అని చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజమౌళి.. ఎన్టీఆర్ పాత్ర గురించి పాజిటీవ్‌గా మాట్లాడి చెర్రీ ఫ్యాన్స్‌ను హర్ట్ చేశారు.
అలా జరిగుంటే..
‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ హీరో అని, ఎన్‌టీఆర్ సైడ్ క్యారెక్టర్ మాత్రమే అని ఫ్యాన్స్ విమర్శించారు. దీంతో రాజమౌళి దీని గురించి మాట్లాడారు. ఈ మూవీలోని ‘కొమురం భీముడో’ పాటకు థియేటర్లలో ప్రేక్షకులంతా తెగ ఇంప్రెస్ అయిపోయారు. ఒకవేళ మూవీ.. ఈ పాట తర్వాత అయిపోయి ఉండుంటే ఎన్‌టీఆర్‌నే ప్రేక్షకులు హీరో అనేవారని రాజమౌళి తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్‌ది సైడ్ క్యారెక్టర్ అయ్యేదని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రామ్ చరణ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఎన్‌టీఆర్‌కు సపోర్ట్ చేసే విధంగా జక్కన్న వ్యాఖ్యలు ఉన్నాయని వాపోతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ముందు నుండి ఇద్దరు హీరోలు ‘ఆర్ఆర్ఆర్’కు ప్రాణం పోశారని చెప్తూ వస్తున్నారు.
ఇంకా ప్రారంభించలేదు..
ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యి దాదాపు రెండేళ్లు అయ్యింది. కానీ రాజమౌళి మాత్రం ఇంకా తన తరువాతి సినిమాను ప్రారంభించలేదు. మహేశ్ బాబుతో తన తరువాతి చిత్రం ఉంటుందని అనౌన్స్ చేశారు కానీ ఇంకా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టలేదు. ఇంతలోనే త్రివిక్రమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేశ్. ఈ మూవీ ఫస్ట్ డే నుండే మిక్స్‌డ్ టాక్‌ను సాధించినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది. అంతే కాకుండా ‘గుంటూరు కారం’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Also Read: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ ఉమెన్ మూవీ, హీరోయిన్ ఎవరో తెలుసా?