అన్వేషించండి

Raj Tarun: ఆ బిగ్ బాస్ బ్యూటీతో రాజ్ తరుణ్‌కు అఫైర్ - సంచలన ఆరోపణలు చేసిన లావణ్య

Raj Tarun: రాజ్‌ తరుణ్‌‌కు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతోనూ అతని సంబంధం ఉందని అంటోంది.

Raj Tarun Vs Lavanya: టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌ తనతో కొన్నేళ్లు సహజీవనం చేసి, ఇప్పుడు మాల్వీ మల్హోత్రాకి దగ్గరై తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా రాజ్ తరుణ్ పై మరికొన్ని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. అతనికి చాలామందితో ఎఫైర్స్ ఉన్నాయని, ఆ లిస్టులో 'ఇద్దరి లోకం ఒకటే' నటి షాలినీ పాండే, 'లవర్' హీరోయిన్ రిద్ది కుమార్ తో పాటుగా బిగ్ బాస్ అరియానా గ్లోరీ కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. ''రాజ్ తరుణ్‌కు చాలా ఎఫైర్స్ ఉన్నాయి. అవి నాకు ప్రాబ్లమ్ అయ్యుంటే ఇన్నేళ్ళలో ఎప్పుడో ఈ పని చేసేదానిని కాదు. డబ్బుల కోసమే అయితే పదేళ్లు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇంత జరిగి నా లైఫ్ రోడ్డున పడ్డాకా ఏదీ దాచుకోవాలి అనుకోవడం లేదు. 'లవర్' సినిమా నుంచే ఇలాంటి ఎఫైర్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచే మా మధ్య గొడవలు మొదలయ్యాయి'' అని అన్నారు. ''రిద్ది కుమార్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఒక ఏడాది పాటు వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు. నేను ఆ అమ్మాయికి కాల్ చేసి చెప్పడంతో, 6 నెలల తర్వాత ఆ అమ్మాయి ఆపేసింది'' అని లావణ్య చెప్పింది. కొంతమంది హీరోయిన్ల పేర్లు గుర్తుకురావడం లేదని తెలిపింది.

"ఇద్దరి లోకం ఒకటే సినిమా హీరోయిన్ తో కూడా రాజ్ తరుణ్ ఉన్నాడు. అలానే బిగ్ బాస్ అరియానా గ్లోరీతో మాట్లాడేవాడు. ఆమెతో కేవలం ఒక రోజు మాత్రమే షూటింగ్ రిగింది. పెద్దగా పరిచయం కూడా లేదు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఒక్క రోజులోనే కలిసిపోయారు. అప్పట్లో నాకు డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ సమయంలో 3 నెలల కోర్సు కోసం గోవా వెళ్లాను. నేను వెళ్లిన ఒక నెల రోజులకే హైదరాబాద్ లో అరియానాతో స్టార్ట్ చేశాడు. నటుడు రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి 'నీకు హస్బెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఈ కోర్సులన్నీ ఎందుకు. అతన్ని చూసుకుంటే సరిపోదా. నువ్వు ఇప్పుడు తిరిగి రాకపోతే రాజ్ తరుణ్ నీ చేయి దాటిపోతాడు' అని అన్నాడు. అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేసాను'' అని లావణ్య తెలిపింది. మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత నమ్మకం పోయిందని.. మాల్వీ తనను జైలుకి పంపిస్తానని బెదిరించిందని చెబుతోంది. 
 
రాజ్ తరుణ్ కు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నా, అతనంటే ఇష్టంతోనే ఇన్నాళ్లు ఉన్నానని లావణ్య చెప్పింది. ఇప్పటికీ తనని కావాలని అనుకుంటున్నానని, కానీ ఇంత జరిగాక ఆ హోప్ లేదని అంటోంది. తనను ఒదిలించుకోవడానికి జైలుకైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్న రాజ్ తరుణ్, మళ్ళీ తనను యాక్సెప్ట్ చేస్తాడనే నమ్మకం లేదని తెలిపింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా అతను తానా అంటే తందానా అంటారని, తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని అన్నారని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్‌కు చెందిన 15 కుక్కలు ప్రస్తుతం తన వద్దే ఉన్నాయని, అతని ఎన్ని చేసినా యాక్సెప్ట్ చేశానని చెబుతోంది. మరి ఈ ఎఫైర్స్ ఆరోపణలపై రాజ్ తరుణ్, అరియానా ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి - 'గేమ్ ఛేంజర్' అప్‌డేట్‌తో వచ్చిన రామ్ చరణ్, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget