Ram Charan's Game Changer: మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి - 'గేమ్ ఛేంజర్' అప్‌డేట్‌తో వచ్చిన రామ్ చరణ్, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Game Changer Shooting Update: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ మూవీ 'గేమ్ ఛేంజర్'. తాజాగా చెర్రీ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేడ్ అందించారు.

Game Changer Shooting Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు మధ్యలో 'ఇండియన్ 2' సినిమాని ఫినిష్ చేయాల్సిన పరిస్థితి రావడం కూడా ఈ ప్రాజెక్ట్ లేట్ అవ్వడానికి ప్రధాన కారణం. దీని వల్ల ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న చెర్రీ నెక్స్ట్ మూవీ 'RC 16' సైతం ఇంతవరకూ సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ లో చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
“గేమ్ మారబోతోంది.. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తి చేశాను. సినిమాస్ లో కలుద్దాం” అని రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ డే, లాస్ట్ డే షూటింగ్స్ కు సంబంధించిన రెండు ఫోటోలను షేర్ చేసారు. వీటిల్లో చెర్రీ బ్యాక్ సైడ్ లుక్ ని చూపిస్తూ హెలికాఫ్టర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇవే ఫోటోలను చిత్ర బృందం పంచుకుంటూ ''మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి.. స్టారుల్లోక్కటైన స్టారు వొచ్చేనండి'' అంటూ 'జరగండి' పాటలోని లిరిక్స్ తో ఎలివేట్ చేసారు. ''ఇది మా 'గేమ్ ఛేంజర్' రామ్ చరణ్ షూటింగ్ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ. షూటింగ్ పూర్తయింది. త్వరలో మీకు కొన్ని క్రేజీ అప్‌డేట్‌లను అందిస్తాం'' అని పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
ఆదివారం సాయంత్రం జరిగిన 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' మూవీ గురించి మాట్లాడారు. ''రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. చరణ్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా? అని ఎదురు చూసే పవర్ ఉన్న మంచి యాక్టర్. సినిమాలో అది మీకు అర్థం అవుతుంది. రామ్ చరణ్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరో 10 - 15 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అది పూర్తి అయ్యాక విడుదల తేదీని ప్రకటిస్తాం'' అని శంకర్ చెప్పారు.
Mars nunchi Massu Piece-u Vacchenandi…❤️🔥❤️🔥❤️🔥❤️🔥#GameChanger @AlwaysRamCharan pic.twitter.com/cR769VA3vn
— Sri Venkateswara Creations (@SVC_official) July 8, 2024
'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ రోల్. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, 'జరగండి' సాంగ్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఎస్.జె సూర్య విలన్ క్యారక్టర్ ప్లే చేస్తున్నారు. శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని, ప్రకాష్ రాజ్, నాజర్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, రాజీవ్ కనకాల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
శంకర్ కు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. సమీర్ మహమ్మద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడం, సిజి వర్క్ కూడా ముందే పూర్తయినందున.. దీపావళికి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అప్పుడు కుదరకపోతే ఏడాది చివర్లో డిసెంబర్ లో రావొచ్చని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

