అన్వేషించండి

Dacoit First Review: డెకాయిట్ ఫస్ట్ రివ్యూ... సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటంటే?

Dacoit Movie Review: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్'ను రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, సుజీత్ చూశారు. సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?

Dacoit Movie Review In Telugu: హీరో అడివి శేష్, దర్శకుడు సుజీత్, హీరో నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్, ప్రముఖ హాస్యనటుడు 'వెన్నెల' కిశోర్ మంచి స్నేహితులు. వాళ్ళంతా ఓ గ్యాంగ్. తన ప్రతి సినిమానూ విడుదలకు ముందు స్నేహితులకు చూపించడం అడివి శేష్ (Adivi Sesh)కు అలవాటు. 'డెకాయిట్'ను కూడా అలాగే చూపించారు. సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటో తెలుసా?

'డెకాయిట్'కు రాహుల్ రవీంద్రన్ రివ్యూ ఏమిటంటే?
Dacoit first review in Telugu: తనకు అడివి శేష్ ను చూస్తే గర్వంగా ఉందని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇప్పటి వరకు శేష్ చేసిన సినిమాలు, పెర్ఫార్మన్స్‌లు అన్నిటిలో కంటే 'డెకాయిట్'లో ది బెస్ట్ అని ఆయన స్పష్టం చేశారు. ఇంకా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... ''ఈ సినిమా చేసే ముందు కొన్ని డౌట్స్ ఉండేవి. అరే... వీడు (శేష్) ఎన్నారై. ఈ క్యారెక్టర్ చేస్తానని అంటున్నాడు ఏంటి? అనుకున్నాం. కానీ పది నిమిషాలు అయ్యేసరికి స్క్రీన్ మీద నా బెస్ట్ ఫ్రెండ్ ని చూస్తున్నా అనేది మర్చిపోయా. క్యారెక్టర్‌తో ట్రావెల్ చేశా. చాలా చాలా కన్విక్షన్ తో చేశాడు'' అని తెలిపారు.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... ''నేను సినిమా చూశాను కాబట్టి చెబుతున్నా... ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చింపేసింది. షి ఈజ్ ఫెంటాస్టిక్. కొంత మంది స్క్రీన్ మీద ఏడిస్తే... తెలియకుండా మనం కూడా ఎమోషనల్ అవుతాం. వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతాం. మృణాల్ అంత అద్భుతంగా నటించింది. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ నాకు చాలా బాగా నచ్చారు'' అని చెప్పారు. 

Also Readడెకాయిట్ vs హిట్ 2... డబుల్ మార్జిన్‌తో బిజినెస్, అడివి శేష్ లాస్ట్ 5 ఫిలిమ్స్ మార్కెట్ తెలుసా?

మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్!
'డెకాయిట్' ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లోయింగ్ అని 'వెన్నెల' కిశోర్ తెలిపారు. అదే విధంగా క్లైమాక్స్ కూడా బావుందని చెప్పారు. అడివి శేష్ కి దణ్ణం పెట్టారు. శేష్ ప్రతి సినిమా తాము విడుదలకు ముందు చూస్తామని... ఇంటర్వెల్ & క్లైమాక్స్ చూసి ఒక 'హై'తో బయటకు వస్తామని రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ తెలిపారు.

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించిన 'డెకాయిట్'తో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

Also Read: Adivi Sesh: స్నేహితుడి దర్శకత్వంలో అడివి శేష్... 'గూఢచారి' సీక్వెల్ తర్వాత!

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget