అన్వేషించండి

Rahul Ramakrishna: ఖాళీ థియేటర్లు... చెత్త సినిమాలు... రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు

Rahul Ramakrishna Latest Tweet: ప్రస్తుత తెలుగు సినిమాల గురించి రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు చేశారు. ఖాళీ థియేటర్ల నుంచి ఆడియన్స్ వరకు ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood) అత్యంత కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతి ఏడాదీ సమ్మర్ సీజన్ అంటే స్టార్ హీరోల సినిమాలు, మరీ ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల గలగలలు వినిపించేవి. ముఖ్యంగా ఈ ఏడాది (2026) వేసవిలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం వల్ల థియేటర్లు ఖాళీ ఖాళీగా ఉన్నాయి. ప్రేక్షకుల లేక వెలవెలబోతున్నాయి. ఇప్పుడు ప్రేక్షకులు ఆలోచనల్లో కూడా మార్పులు రావడం వల్ల టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగల లేదు. ప్రతి సినిమాకు ప్రేక్షకులు రావడం లేదు. దాంతో నిరాశాజనకమైన పరిస్థితి కనబడుతోంది. ఈ పరిస్థితిపై నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్' (ట్విట్టర్)లో చేసిన కామెంట్ చేశారు. అది పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఇంతకీ, ఆయన ఏమన్నారంటే?

ఖాళీ థియేటర్లు... ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు
"ఖాళీగా ఉన్న థియేటర్లు మనం చేసే పని (తీసే సినిమాలు) ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిజాయితీగా ఇచ్చే తీర్పు" అని రాహుల్ రామకృష్ణ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ప్రస్తుతం ప్రజలు అలవాటు పడిన మోడ్రన్ లైఫ్ లో సాధారణ మనిషి సినిమాకు రావాలంటే చాలా కష్టం. ప్రేక్షకుడి ముందు చాలా ఉన్నాయ్. భయంకరమైన వేసవి ఎండలు, ట్రాఫిక్ సమస్యలు, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పార్కింగ్ ఖర్చులు, పన్నులు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటివి జనాలను థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి. వీటిని దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే... ఫోనులో చూడలేని గొప్ప దృశ్య కావ్యంలా సినిమా ఉండాలి. లేదా అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా ఉండాలి'' పేర్కొన్నారు.

Also Read: Suriya - హైదరాబాద్‌లో సూర్య కాళ్ళ మీద పడిన వీరాభిమాని... షాక్‌లో కార్తీ

ఫిల్మ్ మేకర్స్ అహంకారాన్ని పక్కన పెట్టండి!
Rahul Ramakrishna advice to filmmakers: దర్శక నిర్మాతలు తమ అహంకారాన్ని పక్కన పెట్టాలని రాహుల్ రామకృష్ణ సూచించారు. ప్రేక్షకులు ఏమీ సినిమా మేకింగ్ టెక్నిక్స్‌ని అర్థం చేసుకోలేనంత తెలివితక్కువ వారు కాదని చెప్పారు. ప్రేక్షకులను తక్కువ అంచనా వేయడం, వాళ్లకు ఏమీ తెలియదని భావించడం పెద్ద తప్పు అని ఆయన హెచ్చరించారు. డిజిటలైజేషన్ కారణంగా ప్రతి ఒక్కరికీ కెమెరా టెక్నీక్స్, సినిమా తీసే విధానంపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. అందువల్ల ప్రేక్షకులను తక్కువ అంచనా వేయొద్దన్నారు. క్వాలిటీ సినిమాలు ప్రేక్షకులకు అందించడం మీద దృష్టి పెట్టాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చారు.

Also ReadAshu Reddy Crying - వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ

టికెట్ రేట్స్ మీద పునఃసమీక్షించుకోవాలని రాహుల్ రామకృష్ణ కోరారు. ప్రేక్షకుల గౌరవించేలా సినిమాలు ఉండాలన్నారు. ప్రేక్షకులను అవమానిస్తూ కృతజ్ఞత ఆశించడం, సినిమాలకు ఆదరణ ఉండాలని కోరుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ సినిమాలపై ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది సరైన సమయమని 'ఎక్స్'లో రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు చూశాక ట్వీట్స్ చేశానని తెలిపారు. తన అభిప్రాయాలను వెల్లడించడంతో రాహుల్ రామకృష్ణ ఎప్పుడూ మొహమాటపడరు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద గతంలో విమర్శలు చేసి ట్రోలింగ్ తట్టుకోలేక ఆ ట్వీట్లు డిలీట్ చేశారు.

Also ReadWho Is Agnimitra Paul - ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లో తొలి మహిళా మంత్రిగా

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget