అన్వేషించండి

Raghava Lawrence: 'పిచ్చి పట్టినా సరే పిచ్చి పిచ్చిగా తీస్తాను'.. 'కాంచన 4' పై లారెన్స్‌ ఫన్నీ కామెంట్స్!

హారర్ సినిమాలపై రాఘవ లారెన్స్‌ ఫన్నీ కామెంట్స్ చేసారు. ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’ ప్రెస్ మీట్ లో 'కాంచన 4' సినిమాపై స్పందించారు. పిచ్చి పట్టినా సరే పిచ్చి పిచ్చిగా సినిమా తీస్తానని అన్నారు.

హారర్ కామెడీ జోనర్ చిత్రాల్లో 'ముని' ప్రాంచైజీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రాలను దర్శక హీరో రాఘవ లారెన్స్ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ వచ్చిన 'ముని' 'ముని 2 - కాంచన' 'కాంచన 2' 'కాంచన 3' వంటి నాలుగు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఓవైపు ప్రేక్షకులను భయపెడుతూనే, మరోవైపు కడుపుబ్బా నవ్వించాయి. అందుకే 'కాంచన 4' ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా లారెన్స్ దగ్గర ప్రస్తావించగా.. ఫన్నీ కామెంట్స్ చేసారు. 

రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్‌ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 'ముని' సిరీస్ లో మరో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 'కాంచన 4' ఎప్పుడు ఉంటుంది? అని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి లారెన్స్‌ సమాధానమిస్తూ.. హారర్‌ సినిమాలతో తన మైండ్ అంతా పిచ్చిపిచ్చిగా అయిపోయిందన్నారు. 

''అన్నీ దెయ్యాల సినిమాలు తీసి, నా మైండ్‌ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అలాంటి కథలు రాయాలన్నా, తీయాలన్నా అలా పిచ్చి పిచ్చి మైండ్ తోనే ఉండాలి. ఆ సినిమాలు తీసే సమయంలో పడుకున్నా కూడా అవే ఆలోచనలు వస్తుంటాయి. ప్రశాంతంగా నిద్రపోలేము. ఇంట్లో అద్దం ముందు అలా నిలబడిపోతుంటా. 'ఏరా.. కాంచన సినిమా తీస్తే ఇంట్లో కూడా కాంచనలా మారిపోతావ్' అని మా అమ్మ అంటుంది. మా తమ్ముడి బాబు కూడా అంకుల్ వేరేలాగా మారిపోయాడు అంటుంటాడు. ఇంట్లో నుంచి మొదలైతేనే మిమ్మల్ని నవ్వించగలుగుతాను. ఏదో ఒక రోజు 'కాంచన 4' తీస్తా. పిచ్చి పట్టినా సరే పిచ్చి పిచ్చిగా తీస్తాను'' అని రాఘవ లారెన్స్ ఫన్నీగా చెప్పుకొచ్చారు.

‘చంద్రముఖి 2’ ప్లాప్ పై లారెన్స్ ఏమన్నారంటే..

ఇటీవల పి. వాసు దర్శకత్వంలో లారెన్స్, కంగనా రనౌన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి 2’ సినిమా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీనిపై రాఘవ స్పందిస్తూ.. హిట్‌, ఫ్లాప్‌ల గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. ''చంద్రముఖి-2 సినిమాకు సంబంధించి నా డబ్బులు నాకు వచ్చాయి. అందులో నలుగురు హీరోయిన్స్‌ తో కలిసి చేశా. లైఫ్‌ లో అన్నిట్లో మనం విజయం సాధించాలని లేదు. నేను మొదట్లో గ్రూప్‌ డ్యాన్సర్‌ నుంచి డ్యాన్స్ మాస్టర్‌ అయితే చాలు అనుకున్నా. అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యా. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను. ఈ గ్లామర్‌ ను పెట్టుకుని హీరో ఛాన్స్ ఇవ్వడమే దేవుడు ఇచ్చిన వరం. మళ్లీ దానిలో ఫ్లాప్‌, హిట్‌లు గురించి ఆలోచించకూడదు. అవి మన వెనకాలే వస్తాయి'' అని తెలిపారు. 

Also Read: 'కల్కి' మేకర్స్ నుంచి మరో లీగల్ నోటీస్.. ఈ వార్నింగ్ 'మెగా' టీమ్​కేనా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget