Mistake in Radhe Shyam Movie: సేమ్ మిస్టేక్ రిపీట్ చేసిన 'రాధే శ్యామ్' టీమ్! ఎందుకు ఇలా?
'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్‌లో యూనిట్ ఓ మిస్టేక్ చేసింది. అదేంటో గుర్తు ఉందా? సేమ్ మిస్టేక్ అమెరికాకు పంపిన 'రాధే శ్యామ్' ప్రింట్స్‌లోనూ చేసింది. అదేంటో తెలుసుకోండి మరి!
'రాధే శ్యామ్'లో కృష్ణంరాజు ఉన్నారా? లేదా? సినిమా విడుదలైన రోజు (శుక్రవారం) ఉదయం చాలా మందికి వచ్చిన సందేహం ఇది. కృష్ణంరాజును తీసేసి... ఆయన బదులు సత్యరాజ్‌ను తీసుకున్నారని భావించారు. కృష్ణంరాజును కేవలం ప్రచార చిత్రాలకు మాత్రమే పరిమితం చేశారనే ప్రచారం జరిగింది. ఇది రెబల్ స్టార్ అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. అయితే... తెలుగు రాష్ట్రాల్లో షోలు పడిన తర్వాత వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. దీన్నంతటికీ కారణం ఓవర్సీస్ షోస్ అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే...
'రాధే శ్యామ్'లో విక్రమాదిత్యగా ప్రభాస్ నటించారు. విక్రమాదిత్యకు గురువుగా, పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటించారు. ఇదే పాత్రను తమిళంలో సత్యరాజ్ చేశారు. హిందీ వెర్షన్ కూడా ఆయనే చేసినట్టు తెలుస్తోంది. అయితే... అమెరికాకు వెళ్లిన 'రాధే శ్యామ్' తెలుగు ప్రింట్స్‌లో కృష్ణంరాజు లేరు. పరమహంసగా సత్యరాజ్ ఉన్నారు. సినిమా ప్రారంభంలో కృష్ణంరాజు బదులు ఆయన కనిపించే సరికి ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ షాక్ అయ్యారు. వరుస ట్వీట్స్ చేశారు. అవి చూసి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు, ఫ్యాన్స్ కృష్ణంరాజును తీసేయడం ఏమిటని కంగారు పడ్డారు. అదీ సంగతి!
Also Read: Radhe Shyam Review - 'రాధే శ్యామ్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
'రాధే శ్యామ్' టీమ్ ఈ మిస్టేక్ రిపీట్ చేయడం ఇది రెండోసారి. రిలీజ్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు కూడా కృష్ణంరాజు బదులు సత్యరాజ్‌ను చూసి తెలుగు ఆడియన్స్ ట్వీట్ చేయడంతో యూనిట్ మిస్టేక్ సరిచేసుకుంది. మరి, ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. అయితే... సేమ్ మిస్టేక్ రిపీట్ చేయడంపై కొంత మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్, నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్-టికెట్ ధరపై రూ.25 పెంచుకునేందుకు అనుమతి