Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Mega 158 Update : కూలీ ఫేం, కన్నడ బ్యూటీ అనస్వర రాజన్ క్రేజీ ఆఫర్ కొట్టేశారు. మెగా బాబీ మూవీలో ఆమె కీలక రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది.

Rachita Ram Replaces Honey Rose In Chiranjeevi Mega 158 Movie : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబో యాక్షన్ థ్రిల్లర్ మెగా 158 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్‌గా ఈ మూవీ షెడ్యూల్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా... మరో హీరోయిన్ జాయిన్ అయ్యారు.
ఆమె ప్లేస్‌లో కన్నడ బ్యూటీ
ఈ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం తొలుత వీర సింహారెడ్డి ఫేం, మలయాళ బ్యూటీ హనీ రోజ్ అనుకున్నా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. ఆమె ప్లేస్‌లో రచితా రామ్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా రజనీ కాంత్ కూలీ మూవీలో రచిత నెగిటివ్ రోల్‌లో అదరగొట్టారు.
ప్రస్తుతం కన్నడలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న ఈ బ్యూటీ మెగా మూవీలో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. కూలీ తరహాలోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మూవీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. 2022లో వచ్చిన సూపర్ మచ్చి మూవీతో రచితా రామ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చిరు మాజీ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించాడు. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ రాలేదు. నాలుగేళ్ల తర్వాత చిరు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.
Also Read : Anasuya Bharadwaj : అచ్చియమ్మ రోల్... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
పొల్లాచ్చిలో షూటింగ్
ప్రస్తుతం మెగా 158 మూవీ షూటింగ్ పొల్లాచ్చిలో సాగుతోంది. ఛాంపియన్ ఫేం అనస్వర రాజన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరు కుమార్తె పాత్రలో ఆమె నటిస్తుండగా... ఇప్పటికే ఇద్దరిపై కీలక సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. బెంగాల్ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల ఎమోషనల్‌తో పాటు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేస్తుండగా... కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వాల్తేరు వీరయ్య వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబో కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read : Vijay Sethupathi : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్ డేట్, టైం ఫిక్స్ - మక్కల్ సెల్వన్ వెరీ స్పెషల్ మూమెంట్స్
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















