అన్వేషించండి

Raashii Khanna: కియరా భర్తతో రాశీఖన్నా రొమాన్స్, అతడినే పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ ప్రశ్నలు - ఘాటుగా స్పందించిన బ్యూటీ

Raashii Khanna: ‘యోధ’ సినిమాలో రాశీ ఖన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించారు. ఇందులో వారి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది అని కామెంట్స్ వినిపించగా.. వాటిపై రాశీ స్పందించింది

Raashii Khanna About Relationship With Sidharth Malhotra: కొంతమంది హీరోహీరోయిన్ల ఆన్‌లైన్ కెమిస్ట్రీ చూస్తుంటే.. వారు ఆఫ్ స్క్రీన్ కూడా కపుల్ ఏమో అనే అనుమానాలు వస్తుంటాయి. అలా చాలామంది నటీనటుల మధ్య రిలేషన్‌షిప్ రూమర్స్ కూడా బయటికొచ్చాయి. ఇటీవల విడుదలయిన ‘యోధ’ చిత్రంలో రాశీ ఖన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా కెమిస్ట్రీ కూడా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ సిద్ధార్థ్‌కు నటి కియరా అద్వానీ(‘గేమ్ ఛేంజర్’ హీరోయిన్)తో పెళ్లి అయిపోవడంతో అలాంటి రూమర్స్ ఏమీ రావడం లేదు. ఇక ‘యోధ’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రాశీకి సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకోవడంపై అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి తను ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

అది వాళ్ల అభిప్రాయం..

చాలామంది ప్రేక్షకులు.. ‘యోధ’లో రాశీ, సిద్ధార్థ్ కెమిస్ట్రీ చూసి వారు రియల్ లైఫ్ కపుల్ అయితే కూడా బాగుంటుందని కామెంట్స్ చేయడం ఈ హీరోయిన్ దృష్టికి వచ్చింది. దీంతో ఈ కామెంట్స్‌పై రాశీ స్పందించక తప్పలేదు. ‘‘అది ఫ్యాన్స్ అభిప్రాయం. వాళ్లకు నేను ఏంటో తెలియదు. సిద్దార్థ్ ఏంటో తెలియదు కాబట్టి వాళ్లు ఏదైనా అనేయవచ్చు. మేము ఒకరికి ఒకరం అస్సలు సెట్ అవ్వమేమో. వాళ్లకు పాట నచ్చింది. అందులో మా కెమిస్ట్రీ నచ్చింది. కానీ వాళ్లకు మేమేంటో కొంచెం కూడా తెలియదు. అయినా పర్వాలేదు ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది’’ అంటూ వివరణ ఇచ్చింది రాశీ ఖన్నా. అంతే కాకుండా వారి జోడీకి మంచి మార్కులు పడడంపై సంతోషం వ్యక్తం చేసింది.

గొప్ప స్నేహితులం కాదు..

ఇక తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని ప్రశ్నించగా.. ‘‘మెచ్యూర్‌గా ఆలోచించలేని వారు నాకు అస్సలు నచ్చరు. ఎంత ఎదిగినా కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల్లాగా ప్రవర్తించే మగవారిని నేను భరించలేను. అందుకే బాధ్యతగా ఉంటూ జీవితాన్ని అర్థం చేసుకునే మనిషి నాకు కావాలి’’ అని క్లారిటీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఇక ‘యోధ’ కోసం మొదటిసారి చేతులు కలిపారు రాశీ, సిద్ధార్థ్. దీంతో అసలు సిద్ధార్థ్‌తో పనిచేసిన అనుభవం ఎలా ఉందో చెప్పుకొచ్చింది ఈ భామ. సెట్స్‌లో ఒకరితో ఒకరు ఎలా ఉండేవారో బయటపెట్టింది. ‘‘అతడు నాలాగే ఇంట్రోవర్ట్. మేము అంత గొప్ప స్నేహితులం కాదు. ఎప్పుడూ మాట్లాడుకుంటూ కూడా ఉండము’’ అంటూ వారి రిలేషన్ ప్రొఫెషన్ వరకే అని క్లారిటీ ఇచ్చింది.

ఏం చేయాలో మాకు తెలుసు..

‘‘నాకు, సిద్ధార్థ్‌కు మధ్య మంచి కో స్టార్ రిలేషన్‌షిప్ ఉంది. షూటింగ్‌లో ఎక్కువగా మా పని మేము చూసుకునేవాళ్లం. నేను అతడిని కలిసినప్పుడే నా టైప్ అని అనుకున్నాను. తను కూడా అలాగే అనుకున్నాడు. మేమిద్దరం ఇంట్రోవర్ట్సే. మాకు సినిమాపై అవగాహన ఉంది. ఒక లవ్ సాంగ్‌లో నటించాలంటే యాక్టర్స్‌గా ఏం చేయాలో మాకు తెలుసు. మేము స్క్రీన్‌పై బాగుంటామని తెలుసు. కానీ ప్రేక్షకుల దగ్గర నుండి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. మా మధ్య ఢిల్లీ కనెక్షన్ కూడా ఉంది. తను నాతో ఢిల్లీ గురించి, తను చదివిన పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉండేవాడు. సినిమాల గురించి కూడా చాలా మాట్లాడుకునేవాళ్లం’’ అంటూ సిద్దార్థ్ మల్హోత్రాతో తనకు ఉన్న రిలేషన్‌షిప్‌పై వివరణ ఇచ్చింది రాశీ ఖన్నా.

Also Read: ఇదేం పిచ్చిరా బాబు! రోజ్‌ను సేవ్ చేసిన ఆ ‘టైటానిక్’ డోర్ వేలం, ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget