Allu Arjun x Novak Djokovic: సెంట్రల్ కోర్టుకు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ స్టైల్... 'తగ్గేదే లే' అంటున్న జకోవిచ్
Djokovic Poster In Pushparaj Style: పుష్ప రాజ్ క్యారెక్టర్, పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్, తగ్గేదేలే మేనరిజం ఎంత పాపులర్ అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

పుష్ప రాజ్ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). బహుశా... ఆ పాత్రలో మరో కథానాయకుడిని ప్రేక్షకులు ఎవరు ఊహించుకోలేరు. 'పుష్ప రాజ్'గా అర్జున్ యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్, పాత్రలో ఆయన చూపించిన మేనరిజం ఎంత పాపులర్ అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
శేషాచలం అడవుల నుంచి సెంట్రల్ కోర్టు వరకు!
'పుష్ప' సినిమాలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సాధారణ కూలీ నుంచి దేశ విదేశాలలో ఎర్రచందనం వ్యాపారం శాసించే స్థాయి వరకు పుష్పరాజ్ ఎదుగుతాడు. 'తగ్గేదే లే' అంటూ దూసుకు వెళ్ళాడు.
Also Read: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ భామ... 'విశ్వంభర'లో ఐటమ్ సాంగ్ చేసే అందాల భామ ఎవరంటే?
'తగ్గేదే లే' మేనరిజం ఎంత పాపులర్ అయ్యిందంటే... క్రికెట్ గ్రౌండులో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆ మేనరిజాన్ని ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఆ మేనరిజం క్రికెట్ నుంచి టెన్నిస్ వరకు వెళ్లింది.
From Seshachalam to Centre Court…#PushpaRaj’s attitude goes global! 😎@DjokerNole x #JhukegaNahi 🔥
— Pushpa (@PushpaMovie) July 1, 2025
It’s not just a gesture, it’s a global statement! 🤙🏻#AlluArjun #Djokovic #Pushpa #PushpaTheRise #Pushpa2TheRule #Wimbeldon2025 pic.twitter.com/vcNLInQmFV
వింబుల్డన్ కోసం జకోవిచ్ పుష్ప థీమ్ పోస్టర్!
వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ జూన్ నెలలో ప్రారంభం అయ్యింది. జూలై 13 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు జకోవిచ్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. అది పుష్ప థీమ్ స్టైల్‌లో ఉండడంతో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.





















