అన్వేషించండి

Pushpa Pushpa Song: ‘పుష్ప పుష్ప..’ సాంగ్ వచ్చేసింది - బన్నీ చేతిలో గాజు గ్లాస్, పవన్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుష్!

Pushpa Pushpa Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ నుండి పాటల సందడి మొదలయ్యింది. ఇందులో నుండి మొదలటి సాంగ్ అయిన ‘పుష్ప పుష్ప’ లిరికల్ వీడియో బయటికొచ్చింది.

Pushpa Pushpa Song From Pushpa 2 Out Now: దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ‘పుష్ప 2’ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అనే ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1 విడుదలయ్యి రెండేళ్లు అయిపోవడంతో పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘పుష్ప 2’ విడుదలకు మూడు నెలలకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుండే ప్రమోషన్స్ ప్రారంభించాలని అనుకుంటోంది మూవీ టీమ్. అందులో భాగంగానే ‘పుష్ప ది రూల్’ నుండి మొదటి పాట అయిన ‘పుష్ప పుష్ప’ తాజాగా విడుదలయ్యింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఈ సాంగ్ రిలీజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఫేమస్ సింగర్స్‌తో..

‘పుష్ప 2’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతోంది. అందుకే ఇందులో ప్రతీ పాట.. ప్రతీ భాషా ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఆయా భాషలోని ప్రముఖ సింగర్స్‌తో పాడించారు మేకర్స్. తాజాగా విడుదలయిన ‘పుష్ప పుష్ప’ పాట విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో నకాష్ అజీజ్, దీపక్ బ్లూ కలిసి ఈ పాటను పాడారు. హిందీలో మికా సింగ్, నకాష్ అజీజ్.. ‘పుష్ప పుష్ప’ పాటకు తమ వాయిస్‌ను ఇచ్చారు. కన్నడలో ఈ పాటను విజయ్ ప్రకాశ్ పాడగా.. మలయాళంలో రంజిత్ పాడాడు. ఇక బెంగాలీలో సైతం ఫేమస్ సింగర్ టిమిర్ బిస్వాస్‌తో ‘పుష్ప పుష్ప’ పాటను పాడించారు మేకర్స్.

నెగిటివ్ కామెంట్స్..

‘పుష్ఫ పుష్ప’కు సంబంధించిన గ్లింప్స్.. కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప ఆంథెమ్ పేరుతో దీనిని విడుదల చేసింది మూవీ టీమ్. కానీ విడుదలయిన కొన్ని గంటల్లోనే ‘పుష్ప పుష్ప’ పాటకు నెగిటివిటీ ఏర్పడింది. అసలు సాంగ్ ఏం బాలేదంటూ చాలామంది నెటిజన్లు.. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ‘పుష్ఫ ది రైజ్’లో కూడా ప్రతీ పాట విడుదలయినప్పుడు ఇలాగే నెగిటివ్ కామెంట్స్  చేశారని, కానీ ఆ తర్వాత అవే బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయని గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా కేవలం గ్లింప్స్ విని పాట ఎలా ఉంటుందో డిసైడ్ అయిపోవడం కరెక్ట్ కాదన్నారు.

మెల్లగా ఎక్కేస్తుంది..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ నమ్మినట్టుగానే ‘పుష్ప 2’లోని మొదటి పాట అయిన ‘పుష్ప పుష్ప’ కాస్త పరవాలేదని ప్రేక్షకులు ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. మొత్తం పాట విడుదలయిన తర్వాత మెల్లగా ఇది అందరికీ ఎక్కేసేలా ఉందని పాజిటివ్‌గా మాట్లాడడం ప్రారంభించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం.. ఏ రేంజ్‌లో ఉంటుందో ‘పుష్ప 2’ టీజర్‌లోనే అర్థమయ్యింది. ఇక పాటల విషయంలో కూడా డీఎస్‌పీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని సాంగ్ చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కొన్నాళ్ల పాటు ఫీస్ట్ ఇవ్వడం కోసం ‘పుష్ప పుష్ప’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆగస్ట్ 15న ‘పుష్ప ది రూల్’ కోసం సంబరాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఇప్పుడే అర్థమయిపోతోంది.

Also Read: తెర మీదకు సూపర్ స్టార్ బయోపిక్‌ - రజనీకాంత్‌ పాత్రలో నటించే హీరో ఎవరంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget