Pushpa 2 Producer On DSP: దేవి శ్రీ ప్రసాద్ మాటల్లో తప్పేముంది? - పుష్ప 2 మ్యూజిక్ ఇష్యూ మీద నిర్మాత రవిశంకర్ రియాక్షన్
Pushpa 2 Producer Ravishankar Yalamanchili: 'పుష్ప 2' చెన్నై ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ పేరు ప్రస్తావిస్తూ... దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు చాలా సంచలనం సృష్టించాయి. ఆ విషయంపై నిర్మాత స్పందించారు.
'పుష్ప 2' సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)... హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అండ్ దర్శక నిర్మాతలు సుకుమార్ - నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మధ్య సఖ్యత అయితే లేదు. ఏం జరిగిందనేది బయటకు తెలియదు. కానీ, దేవి పాటల వరకు తీసుకొని నేపథ్య సంగీతం మరొకరి చేత చేయించారు. ఆ విషయమై చెన్నైలో జరిగిన పుష్ప వేడుకలో దేవి శ్రీ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని గురించి నిర్మాత రవిశంకర్ స్పందించారు.
మాకు తప్పేమీ కనిపించలేదు!
'మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే పేమెంట్ అయినా... లేదంటే స్క్రీన్ మీద పడే క్రెడిట్ అయినా' - ఇది 'చెన్నై పుష్ప వేడుకలో దేవి శ్రీ ప్రసాద్ చెప్పిన మాట. అంతే కాదు... ఆయన అక్కడితో ఆగలేదు. తన లేట్ అని అనవద్దని, తనది ఆన్ టైమ్ అని నేరుగా నిర్మాత రవిశంకర్ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారు.
'పుష్ప 2' ఒక్కటే కాదు... డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తున్న నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఆ సినిమా కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుష్ప ప్రస్తావన వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ఎందుకు ఆ విధంగా మాట్లాడారని అడిగారు. ఆయన మాటల్లో తప్పేముంది? అని రవిశంకర్ సింపుల్ ఆన్సర్ ఇచ్చారు.
''దేవి శ్రీ ప్రసాద్ గారు ఏమన్నారు? నిర్మాతలకు నా మీద లవ్వు ఉంటుంది. అదే విధంగా కంప్లైంట్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువ చెబుతున్నారు అని చెప్పారు. అందులో మాకు తప్పేమీ కనిపించలేదు. మీడియాలో వివిధ రకాలుగా కథనాలు వచ్చాయి'' అని రవిశంకర్ చెప్పారు.
దేవి శ్రీ మాటల్లో తప్పేమీ లేదని చెప్పిన ఆయన... 'పుష్ప 2' నేపథ్య సంగీతం కోసం మరొక సంగీత దర్శకుడుని ఎందుకు తీసుకురావలసి వచ్చింది అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి మాత్రం నిజం... ఇటు దేవి, అటు 'పుష్ప 2' చిత్ర బృందం మధ్య గొడవల కారణంగా రీ రికార్డింగ్ అందించడానికి ఇంకొక సంగీత దర్శకుడు వచ్చారనేది నిజం.
Also Read: అమెరికా అమ్మాయితో సుబ్బరాజు పెళ్లైపోయిందోచ్... 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు
మైత్రి నిర్మాణ సంస్థలో దేవి ఇక చెయ్యరా?
తాము నిర్మించే సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని రవిశంకర్ తెలిపారు. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదని ఇండస్ట్రీలో గుసగుస. తమిళ హీరో అజిత్, దర్శకుడు అధిక రవిచంద్రన్ కలయికలో రూపొందుతున్న 'గుడ్ బాడ్ అగ్లీ' సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోంది. ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కానీ, ఇప్పుడు ఆయనను తప్పించి ఆ స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)ను తీసుకువస్తున్నారని చెన్నై టాక్.