అన్వేషించండి

Director Sukumar : సినిమాలు వదిలేస్తానంటోన్న పుష్ప డైరక్టర్.. సంధ్య థియేటర్​ ఇష్యూ సుకుమార్​పై గట్టిగానే పడిందిగా

Director Sukumar About Cinema : డైరక్టర్ సుకుమార్​పై సంధ్య థియేటర్ ఘటన బాగానే పడినట్టుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలకు దూరమవ్వాలనుకుంటున్నారనే చర్చ మొదలైంది. ఇంతకీ ఏమైందంటే.. 

Director Sukumar Considering Quitting Cinema   : పుష్ప 2 సినిమాను నేషనల్​ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్​కు తీసుకెళ్లిన స్టార్ డైరక్టర్ సుకుమార్ తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఓ పక్క పుష్ప 2 థియేటర్లలో తన మేనియాను కొనసాగిస్తుంటే.. మరొపక్క సుకుమార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. అసలు సుకుమార్​కి ఏమైంది? సినిమాలకు నిజంగానే దూరం కావాలనుకుంటున్నాడా? 

యూఎస్​లో జరిగిన గేమ్​ చేంజర్ ఈవెంట్​కి డైరక్టర్ సుకుమార్ గెస్ట్​గా వెళ్లారు. అయితే ధోప్ అంటే వదిలేయడమని.. యాంకర్ సుమ అందరినీ ప్రశ్నలు అడిగింది. దీనిలో భాగంగా సుకుమార్​ను కూడా సుమ మీరు ధోప్​ అనే పదంతో ఒకటి వదిలేయాలనుకుంటే ఏమి వదిలేస్తారంటూ ప్రశ్నించింది. అస్సలు ఎవరూ ఊహించని ఆన్సర్​నిచ్చి సుకుమార్ అందరినీ షాక్​కు గురిచేశాడు. సినిమాను వదిలేస్తానంటూ జవాబు ఇవ్వడంతో పక్కనే ఉన్న రామ్​ చరణ్​ కూడా షాకయ్యాడు. 

ఈ ప్రశ్న అడిగిన సుమ కూడా షాకై.. ఈ క్వశ్చన్ క్యాన్సిల్ క్యాన్సిల్ అంటూ చెప్పింది. రామ్  చరణ్ కూడా సుకుమార్​ నుంచి మైక్​ తీసుకుని.. కొన్ని సంవత్సరాలుగా ఇలా చెప్పే భయపెట్టిస్తున్నారు అందరినీ.. అదేమి జరగదు అంటూ చెప్పారు. అయితే సుకుమార్ మాత్రం దీనిని సీరియస్​గానే చెప్పినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పుష్ప 2 కమర్షియల్​గా భారీ విజయాన్ని అందుకున్నా.. టీమ్​ అంతా దానిని సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది. 

కొద్దిరోజులుగా సంధ్య థియేటర్ విషయంపై పుష్ప 2 టీమ్​ నెగిటివిటీని మోస్తుంది. ఈ విషయం సుకుమార్​ని కూడా బాగా డిస్టర్బ్ చేసినట్లుందని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. అయితే మరికొందరు పుష్ప 2లోని కొన్ని సీన్లపై సుకుమార్​ నిరాశకు గురయ్యాడని.. అందుకే సినిమాలు మానేయాలనుకుంటున్నారని నచ్చిన స్టోరీలు రాసుకుంటున్నారు. కానీ సంధ్య థియేటర్ ఘటన మాత్రం టీమ్​ మొత్తంపై గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తుంది. 

పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్ట్, కోర్టు కేసులు.. సుకుమార్ సినిమాను వదిలేస్తాను అనడం, రష్మికపై నెగిటివ్ ట్రోలింగ్.. ఇలా టీమ్​పై ఎన్నో అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి. క్రియేటివ్​ డైరక్టర్​ అయినా సుకుమార్ సినిమాలు వదిలేస్తానని చెప్పడమే దీనికి నిదర్శనం. రాజమౌళి స్థాయిలో సుకుమార్​ను నేషనల్ మీడియా సైతం పొగిడేస్తుంటే.. ఆయన మాత్రం ఈ విషయాలకే సినిమాలకు దూరమైపోవడమేంటని సినిమా అభిమానులు ఫీల్ అవుతున్నారు.

ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా సుకుమార్​ ట్రోమా నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తాడో లేదో అంటూ సోషల్ మీడియాలో చర్చ గట్టిగానే సాగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కేస్ కూడా రోజు రోజుకు సీరియస్ అవుతోంది. ఇదిలా ఉండగా.. సంధ్యా ధియేటర్ ఘటన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. కానీ.. తెలంగాణలో ఇకపై బెనిఫిట్స్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెరగవంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. 

Also Read : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: క్రింజ్ కామెడీనా? లేదంటే వెంకీ - రావిపూడి కాంబో నవ్వించిందా?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: క్రింజ్ కామెడీనా? లేదంటే వెంకీ - రావిపూడి కాంబో నవ్వించిందా?
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: క్రింజ్ కామెడీనా? లేదంటే వెంకీ - రావిపూడి కాంబో నవ్వించిందా?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: క్రింజ్ కామెడీనా? లేదంటే వెంకీ - రావిపూడి కాంబో నవ్వించిందా?
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Balakrishna Akhanda 2: ఇక్కడ థియేటర్లలో, అక్కడ కుంభమేళాలో... 'అఖండ 2' అప్డేట్ ఇచ్చిన బాలయ్య, ఫ్యాన్స్‌కి పూనకాలే
ఇక్కడ థియేటర్లలో, అక్కడ కుంభమేళాలో... 'అఖండ 2' అప్డేట్ ఇచ్చిన బాలయ్య, ఫ్యాన్స్‌కి పూనకాలే
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Embed widget