అన్వేషించండి

Amaran: వివాదంలో ‘అమరన్’ - శివకార్తికేయన్ సినిమాని నిషేధించాలంటూ నిరసనలు!

Amaran: శివకార్తికేయన్, సాయి పల్లవి కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది. 

Amaran: తమిళ హీరో శివకార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్‌’. రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని సీనియర్ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇటీవల శివకార్తికేయన్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. మూవీ టీజర్‌లో ముస్లింలను చెడుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ, తమిళ మక్కల్ జననాయక కచ్చి (TMJK) రాజకీయ సంస్థ సభ్యులు బుధవారం తమిళనాడులో నిరసనలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ‘అమరన్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజర్ లో హీరో శివకార్తికేయన్‌ ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంతో ప్రజెంట్‌ చేసారు. కాశ్మీర్ లోని టెర్రర్ ఎటాక్స్ నేపథ్యంలో భారత ఆర్మీని నడిపించే పవర్ ఫుల్ మేజర్ పాత్రలో చూపించారు. ఓవైపు దేశభక్తిని మరోవైపు యాక్షన్‌ అంశాలతో కట్ చేయబడిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ టీఎంజేకే సభ్యులు బుధవారం నిరసనలకు దిగారు. 

‘అమరన్‌’ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని తిరునెల్వేలి, తిరుచిరాపల్లి, తిరుప్పూర్, వెల్లూరు, కడలూరు తదితర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. శివకార్తికేయన్, కమల్ హాసన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఇద్దరు నటులపై గూండాస్ చట్టం ప్రయోగించాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో వారి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిరసకారులను చెదరగొట్టి, పరిస్థితిని కంట్రోల్ చేసారు. కొందరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సందర్భంగా టీఎంజేకే తిరుచిరాపల్లి జిల్లా కార్యదర్శి రాయల్‌ సిద్ధిక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ''అమరన్‌ సినిమా టీజర్‌లో ముస్లింలను, కాశ్మీర్ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సినిమాను నిషేధించాలి'' అని అన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల వారితో సామరస్యంగా జీవిస్తున్న ముస్లింలను తమిళ చిత్ర పరిశ్రమ చెడుగా చిత్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

కాగా, భార‌త ఆర్మీకి విశేష సేవలందించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్త‌కం అధారంగా ‘అమరన్‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఆయన జీవితంపై చాలాకాలం రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసారు. రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ బెటాలియన్‌కు చెందిన మేజర్ వరదరాజన్.. ఏప్రిల్ 2014 లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఒక గ్రామంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు.

ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత శాంతి శౌర్య పురస్కారం అశోక చక్ర లభించింది. ఇప్పుడు అలాంటి స్ఫూర్తిదాయమైన పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నారు. సాయి పల్లవితో పాటుగా భువన్ అరోరా, రాహుల్ బోస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, సోనీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 సమ్మర్ లో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 

Also Read: హీరోలుగా ముగ్గురు కమెడియన్లు.. హిట్టు కొట్టేదెవరు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget