అన్వేషించండి

‘ప్రాజెక్ట్-K’ రూ.600 కోట్లు రాబడుతుంది - ఆసక్తికర విషయాలు చెప్పిన తమ్మారెడ్డి భరద్వాజ

ప్రభాస్ రాబోయే చిత్రం ప్రాజెక్ట్ కె పై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ సినిమా అవుతుందని... గ్లోబల్ గా టాప్ 50లోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు..

Tammareddy Bharadwaj : డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం '‘ప్రాజెక్ట్ కె’'. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ‘ప్రోజెక్ట్-కె’ టీమ్‌లో చేరడంతో మరింత క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా వరల్డ్ సినిమాల సరసన చేరుతుందని పేర్కొన్నారు.

"తెలుగులో అప్పట్లో పొటెన్షియాలిటీ రూ.30 కోట్లంటే చాలా ఎక్కువ అనుకునే వాళ్లం కానీ.. రీసెంట్ డేస్ లో వచ్చిన బాహుబలి, కేజీయఫ్, ఆర్ఆర్ఆర్.. లాంటి సినిమాలు రూ.1000 కోట్లు అనే మాటను కూడా చాలా ఈజీగా మార్చేశాయి. మనకు పొటెన్షియలిటీ తెలిశాక వరల్డ్ సినిమా లెవల్ కు వెళ్లగలమని నా ఒపీనియన్. అంతకుముందు ఇతర భాషలతో ఎలా పోటీ పడగలమని అనుకునేవాళ్లం. అప్పట్లో హిందీ సినిమాను దాటాలంటే పెద్ద కష్టంగా అనిపించేది. కానీ ఇప్పుడు హిందీ సినిమాలను కూడా దాటేసి ముందుకు వెళ్తున్నాం. మన సినిమాల్లో ఇండియన్ టాప్ 10 చూస్కుంటే.. బాహుబలి 1, బాహుబలి 2, కేజీయఎఫ్ 1.. ఇలా చాలా వరకు మన సినిమాలే ఉంటాయి. పెద్దగా ఆడలేదు అనుకున్న ‘సాహో’ లాంటి మూవీస్ కూడా రూ.300 కోట్లు రాబట్టాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు రూ.2 లేదా రూ.300 కోట్లు సాధించడం సాధారణ విషయమైపోయింది" అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

"ప్రస్తుతం నాగ్ అశ్విన్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ ప్రభాస్ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకునేలను కూడా చేర్చారు. ఈ సినిమా గనక సరిగ్గా ప్రొజెక్ట్ చేయగలిగితే వరల్డ్ లో టాప్ సినిమాల సరసన చేరే అవకాశం ఉంది. ఈ మధ్యే ‘ప్రాజెక్ట్ కె’ సెట్ కూడా రెండు, మూడు సార్లు వెళ్లాను. దాని షేపింగ్ అవన్నీ చూస్తుంటే.. దీన్ని ప్రాపర్ గా రిలీజ్ చేస్తే ఇంటర్నేషనల్ గ్లోబల్ సినిమా అవుతుంది. గ్లోబల్ గా టాప్ 50లోకి వెళ్లినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది వరల్డ్ సినిమాను టచ్ చేసే చిత్రం అవుతుంది. ఒకవేళ అది తప్పితే.. ఆ ఛాన్స్ ఉన్న నెక్ట్స్ వచ్చే సినిమా ఏంటంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు రాబోయే మూవీ. కానీ రాజమౌళి అనేసరికి అది ఎంత సమయం పడుతుందో చెప్పలేం. నాకు తెలిసి ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే సంవత్సరం అంటే 2024 సమ్మర్ కి వస్తుందనుకుంటున్నాను. మహేశ్ బాబు సినిమా మాత్రం 2025 లేదా 2026కైనా రావచ్చు. రాజమౌళి ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసినా ఆ మూవీకి అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ. ఆయన సినిమాకు వెయ్యి కోట్లు ఈజీగా వస్తాయి. వరల్డ్ సినిమాలతో పోటీ పడే అవకాశం ఉన్న సినిమాలు ప్రస్తుతం ఈ రెండే అనిపిస్తోంది. మరో 6 లేదా 8 నెలల్లో రాబోయే ‘ప్రాజెక్ట్ కె’ మరి వరల్డ్ మూవీస్ లిస్ట్ లో చేరుతుందా లేదో అప్పుడే చూడాలి. సరిగ్గా చేస్తే మొదటి రోజే రూ.5 లేదా 6 వందల కోట్లు కూడా రావచ్చు. అంత రేంజ్ లో వచ్చే అవకాశం కూడా ఉంది" అని తమ్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

'ఆదిపురుష్' కలెక్షన్లపై..

మామూలుగా ప్రభాస్ అంటేనే భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ‘ఆదిపురుష్’పై అంత నెగెటివ్ ట్రోలింగ్, కామెంట్స్ వచ్చినా కూడా రూ.300 కోట్లు నుంచి రూ.400 కోట్లు వచ్చాయంటే.. భారీ అంచనాలు గల సినిమాలు ఓపెనింగ్ లో బాగానే కలెక్ట్ చేస్తాయి. కాబట్టి ‘ప్రాజెక్ట్ కె’ వరల్డ్ మూవీస్ లో చేరాలని, తెలుగోళ్లు మళ్లీ కాలర్ ఎగరేసి తిరగాలని ఆశిస్తున్నాను. దీని తర్వాత మహేశ్ బాబు సినిమా కూడా ఆ ఛాన్స్ దక్కించుకోవాలని కోరుకుంటూ.. మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి వివరించారు.

Read Also : Priyamani: ఆ మతం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ట్రోల్ చేశారు: ప్రియమణి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Varun Tej: కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
Embed widget