Project K Title : 'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటి - రేసులోకి కొత్త టైటిల్?
'ప్రాజెక్ట్ కె' టైటిల్ ఏంటి? అనేది కొన్ని గంటల్లో వెల్లడించనున్నారు. నిన్నటి వరకు 'కాలచక్రం' అని వినబడింది. ఇప్పుడు రేసులోకి కొత్త టైటిల్ వచ్చింది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ సినిమా 'ప్రాజెక్ట్ కె'. (Project K Movie). నిన్నటి వరకు 'కె' అంటే 'కాలచక్ర' (తెలుగులో 'కాలచక్రం' అనుకోవచ్చు) అని వినబడింది. అయితే, రేసులోకి కొత్త టైటిల్ వచ్చింది. ఇప్పుడు 'కె' అంటే 'కలియుగ్' (తెలుగులో 'కలియుగం' అనొచ్చు) అంటున్నారు.
కాలచక్రమా? కలియుగమా?
'ప్రాజెక్ట్ కె'లో 'కె' అంటే ఏంటి? కాలచక్రమా? కలియుగమా? అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. అమెరికాలోని శాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ 2023లో ఈ సినిమా టైటిల్ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సహా కమల్ హాసన్, దిశా పటానీ, నాగ్ అశ్విన్ తదితరులు టైటిల్ విడుదల కార్యక్రమం కోసం అక్కడికి చేరుకున్నారు. 'కురుక్షేత్రం' టైటిల్ కూడా వినబడుతోంది.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కనుక 'ప్రాజెక్ట్ కె'కి కాలచక్రం అనేది సూట్ అవుతుంది. అలాగే, కలియుగంలో దుష్టశక్తులపై కథానాయకుడు చేసే పోరాటం నేపథ్యంలో చూసుకున్నా... 'కలియుగం' అనేది కూడా పర్ఫెక్ట్ యాప్ట్.
ప్రభాస్ లుక్ మీద మిక్స్డ్ రెస్పాన్స్
Prabhas First Look Project K : 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ బుధవారం విడుదల చేశారు. ఆ లుక్ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. అభిమానులు, మీమర్స్ నుంచి ట్రోలింగ్ నడుస్తోంది. ఎవరి బాడీకి ప్రభాస్ ఫేస్ అతికించినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు అందరి కళ్ళు టైటిల్, టైటిల్ గ్లింప్స్ మీద పడ్డాయి.
Also Read : ఫ్యాన్ మేడ్ పోస్టర్లు బెటర్, 'ఐరన్ మ్యాన్'ను కాపీ కొడతారా? - ప్రభాస్ లుక్కుపై మీమ్స్
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఒక్కటి మాత్రం అర్థం అయ్యింది. ఈ సినిమాలో ఆయన సూపర్ హీరో రోల్ చేస్తున్నారని! హాలీవుడ్ హీరోల తరహాలో ఫస్ట్ లుక్ ఉందని కొంత మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Project K Means : 'ప్రాజెక్ట్ కె' చిత్రానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్నారు. ఇంకా ఈ 'ప్రాజెక్ట్ కె'లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్‌లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇటీవల లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయనున్నారు.
Also Read : 'హిడింబ' సినిమా రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ (Prabhas)కు ధీటైన ప్రతినాయకుడిగా కమల్ హాసన్ (Kamal Haasan) నటించనున్నారని కొన్ని రోజులుగా వినపడుతోంది. విలన్ అని చిత్ర బృందం చెప్పలేదు గానీ సినిమాలో కమల్ ఉన్నారని కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెట్టారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial