అన్వేషించండి

Project K Explained : కలియుగంలో వీరుడు, నమ్ముకున్నోళ్లకు దేవుడు - 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ రోల్ ఇదే!?

Project K Title Glimpse Launch : శాండియాగో కామిక్ కాన్ 2023లో 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ విడుదల చేయడానికి అంతా రెడీ. అసలు, 'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటి? అనే విషయం రివీల్ చేయనున్నారు.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. సినిమా స్టార్టింగ్ నుంచి ఇదొక పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు చెబుతూ వస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ లుక్ చూస్తే... ఆయన యోధుడిలా ఉన్నారు. హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ప్రభాస్ గెటప్ ఉందని కొందరు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే... మరికొందరు నాగ్ అశ్విన్ డిజప్పాయింట్ చేశాడని చెబుతున్నారు. అసలు, ఈ 'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటి? ఓ లుక్ వేయండి!  

కలియుగ వీరుడిగా ప్రభాస్!
'ప్రాజెక్ట్ కె' కథ ఏమిటి? ఈ సినిమా దేని గురించి? చాలా రోజులుగా ఈ విషయంలో దర్శక నిర్మాతలు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ హీరోతో నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నారు? అని అందరూ చర్చల్లో దిగారు. ఇప్పుడు శాండియాగో కామిక్ కాన్ ఫెస్టివల్ 2023లో ఆ అంశంపై ఓ క్లారిటీ ఇవ్వనుంది ప్రాజెక్ట్ కె టీమ్. మూవీ కథ ఏమై ఉంటుంది? అని భారీ హైప్ నెలకొంది. 

'ప్రాజెక్ట్ కె' టీమ్ సినిమాకు సంబంధించిన కొన్ని కామిక్స్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతున్నాయి. కామిక్ కాన్ 2023కి అటెండ్ అవుతున్న అభిమానులు తమకు ఇచ్చిన కామిక్ షీట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి చూస్తే... అర్థమయ్యేది ఏమిటంటే? కలియుగాంతంలో ఓ దుష్టశక్తి ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతుంది. దేవుళ్ళు అందరినీ అంతం చేస్తానని ఆ దుష్టశక్తి చెబుతుంది. సాధారణ ప్రజలను తన బానిసల్లా మారి తననే దేవుడిగా కొలవాలని భయపెడుతూ ఉంటుంది. ఆ దుష్టశక్తికి మద్దతుగా మరికొంత మంది అనుచరులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. తమ నాయకుడిని దేవుడిగా నమ్మి మొక్కాలని, లేదంటే బతకలేరనిచెబుతారు. మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరని భయపెడతారు. సరిగ్గా అప్పుడే హీరో ఎంట్రీ... అతను ఎవరో కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్. కలియుగ వీరుడిగా వస్తారు.

Also Read : హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

రైడర్స్ ను తలదన్నే శక్తితో తనదైన స్టైలిష్ స్పెషల్ సూట్ తో వెనుక నుంచి ప్రభాస్ (Prabhas First Look Project K)ను చూపించారు. నెత్తి మీద ఓ కొప్పు కూడా ఉంది. సమురాయ్ యోధుల తరహాలో అన్నమాట. సో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నమాట. 'ప్రాజెక్ట్ కె' విడుదల చేసిన కామిక్స్ లో అయితే ఉన్నది ఇది. మరి, ఆ దుష్టశక్తి పాత్ర ఎవరు పోషించారు? కమల్ హాసనా? మరొకరా? గ్లింప్స్ రిలీజ్ అయితే క్లారిటీ రాదు.

Also Read 'హిడింబ' సినిమా రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?

రేసులో మూడు టైటిళ్ళు!
Project K Title : 'ప్రాజెక్ట్ కె' టైటిల్ రేసులో ప్రస్తుతానికి మూడు పేర్లు ఉన్నాయి. 'కె' అంటే కాలచక్రం లేదా కలియుగం లేదా కురుక్షేత్రం అయ్యి ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణం.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget