Ideas of India Summit 2024:'ది కేరళ స్టోరీ' నిర్మించే టైంలో మీరు ముస్లింలకు వ్యతిరేకంగా వెళ్లున్నారా? అన్నారు: నిర్మాత విపుల్ షా
ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ నెట్‌వర్క్ (ABP Network) ఆధ్వర్యంలో Ideas of India Summit 2024 కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలే ఎజెండాగా ఏబీపీ నెట్‌వర్క్ ఈ ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్‌ని నిర్వహిస్తోంది.
The Kerala Story Movie Producer Comments: ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ నెట్‌వర్క్ (ABP Network) ఆధ్వర్యంలో Ideas of India Summit 2024 కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలే ఎజెండాగా ఏబీపీ నెట్‌వర్క్ ఈ ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్‌ని నిర్వహిస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్యం, దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు హిందుభావాలపై ఈ చర్చించనున్నారు. ఫిబ్రవవరి 23న ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్ర నిర్మాతలు విపుల్ అమృతలాల్ షా, మధుర్ భండార్కర్, లీనా యాదవ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ప్రముఖ జర్నలిస్ట్, వ్యాపారవేత్త సైలి చోప్రా ఆధ్వర్యంలో జరిగిన Anatomy of Art: Are Our Movies Dividing or Uniting Us'సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ది కేరళ స్టోరీ' నిర్మాత విపుల్ అమృతలాల్ షా మాట్లాడుతూ.. మూవీ రంగంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. తన రిసెంట్ మూవీ ది కేరళ స్టోరీ చిత్రాన్ని ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌ను అపేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ మూవీ మేకింగ్ విషయంలో ఆయన ఎదురైన సంఘటనలపై విపుల్ షా స్పందించారు.
ప్రారంభంలో మూవీ ఇండస్ట్రీలోని రాజకీయా ప్రభావం పెద్దగా ఉండేది కాదు. ఉన్న అవి బహిర్గతం కాలేదు. కానీ ఇప్పుడు ప్రజలందరికి అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. ప్రస్తుతం అరచేతిలోనే ప్రపంచం ఉంది. ఎలాంటి అంశంమైన తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్చ ఉంది. ఇప్పుడు వారందరిని గురించి మనం మాట్లాడుతున్నాం. అలా అని ఇండస్ట్రీని విభజించడం మన ఉద్దేశం కాదు కదా. ఉదాహరణకు నేను 'ది కేరళ స్టోరీ' మూవీ నిర్మిస్తున్న సమయంలో చాలా మంది నాతో ఇలా అన్నారు. "ఓహ్ ఇప్పుడు మీరు ముస్లింలకు వ్యతిరేకంగా వెళ్తున్నారా?" అని ప్రశ్నించారు. అంటే ఈ సినిమాను తెరకెక్కించినంత మాత్రానా నేను ముస్లిం వ్యతిరేకంగా వెళ్తున్నట్టనే? నా కెరీర్‌లో ఇప్పటి వరకు 18 సినిమాలు నిర్మించాను. అందులో రెండు మాత్రమే ముస్లింలను విలన్లుగా చూపించిన చిత్రాలు ఉన్నాయి.
Also Read: స్పెషల్ వెడ్డింగ్ వీడియో షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్, మీరూ చూసేయండి
'ది కేరళ స్టోరీ' అనేది కల్పిత కథతో తీసిన సినిమా కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటన. హ్యామన్ ట్రాఫికింగ్, అమ్మాయిలపై జరిగిన అఘాత్యాలు, విషాదాలను తెరపై ఆవిష్కరించాలనుకున్న. అంతే కానీ ప్రజలను విడదీయాడానికి సినిమాలు తీయను" అంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న మరో నిర్మాత మధుర్ భండార్కర్ స్పందించారు. ప్రజలు తమ రాజకీయ ధోరణిని వ్యక్తం చేయవచ్చు, చేయకపోవచ్చు.. కానీ, ఆ విషయంలో వారికంటు ఒక అభిప్రాయం అనేది తప్పుకుండ అక్కడ ఉంటుంది" అన్నారు. అనంతరం లీనా యాదవ్ ఇలా అన్నారు. రాజకీయాలు అనేవి లేకుండా సినిమాలు తీయవచ్చని నేను అనుకోను. ఎందుకటే మీరు చెప్పే కథ, చేసే సినిమాలో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. అలాగే ప్రతి నిర్మాత వారు చెప్పే కథలో కూడా రాజకీయాలను వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది" ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.