Peddi Release Date : మరోసారి పెద్ది వాయిదా - కామెంట్స్‌పై నిర్మాత SKN క్లారిటీ... టీం రెస్పాండ్ అవుతుందా?
Peddi Movie : రామ్ చరణ్ పెద్ది రిలీజ్ వాయిదాపై రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత SKN చేసిన కామెంట్స్ దీనికి మరింత బలం చేకూర్చగా... ఆయన క్లారిటీ ఇచ్చారు.

Ram Charan Peddi Movie Release Date Issue : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది వాయిదా పడుతుందా? సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఇదే చర్చ. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన మూవీ మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందంటూ ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. తాజాగా, 'చెన్నై లవ్ స్టోరీ' సాంగ్ ఈవెంట్‌లో నిర్మాత SKN చేసిన కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో ఆయన దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
'చిన్న మిస్ కమ్యూనికేషన్'
'జూన్ 26న మా చెన్నై లవ్ స్టోరీ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నాం. అయితే, ఆ తేదీన 'పెద్ది' రిలీజ్ ఉందని సాయి రాజేశ్ చెప్పారు. అందుకే మా మూవీ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తాం.' అని నిర్మాత SKN అన్నారు. దీంతో 'పెద్ది' రిలీజ్‌పై మళ్లీ చర్చ సాగింది. ఆ వీడియో వైరల్ కాగా... SKN వెంటనే క్లారిటీ ఇచ్చారు. తాను పొరపడ్డానని చెప్పారు.
''చెన్నై లవ్ స్టోరీ' ఎప్పుడు రిలీజ్ చేద్దాం? అని సాయి రాజేష్‌ను అడిగితే 'పెద్ది'ని జూన్ 26న రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్స్ కనిపిస్తున్నాయి. అందుకే ఆ మేకర్స్ అనౌన్స్ చేసే వరకూ నువ్వు మన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకు.' అని అన్నారు. వేడుక సందడిలో నేను పొరపడి పెద్ది రిలీజ్ ఫిక్స్ చేసేశారేమో అనుకుని... ఆ డేట్‌కు చెన్నై లవ్ స్టోరీ రాదని చెప్పా. అయితే, వేదిక పైనుంచి కిందకు వచ్చాక అసలు విషయం తెలిసింది. పెద్ది వాయిదా గురించి నేను మాట్లాడడాన్ని తప్పుగా తీసుకోవద్దు.' అంటూ వీడియో రిలీజ్ చేశారు.
IMP CLARIFICATION: pic.twitter.com/EgRUO0c7A2
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 30, 2026
Also Read : ఓటీటీలోకి గుణ శేఖర్ యుఫోరియా - రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
టీం రెస్పాండ్ అవుతుందా?
పెద్ది మరోసారి వాయిదా పడుతుందన్న రూమర్స్‌తో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. దీనిపై మూవీ టీం రియాక్ట్ కావాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉండడం, ఇంకా కొన్ని సీన్స్ చిత్రీకరణ మిగిలే ఉండడంతో వాయిదా వేయక తప్పని పరిస్థితి అంటూ ఇన్ సైడ్ వర్గాల టాక్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్ వీటిన్నింటికీ కేవలం 30 రోజుల టైం చాలదని... అందుకే పోస్ట్ పోన్ అవుతుందంటూ నెట్టింట చర్చ సాగుతోంది. మరి దీనిపై మూవీ టీమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్, పెద్ది పహిల్వాన్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు






















